newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

మీడియా ఆంక్షల జీవో లీక్ పై జగన్ గుస్సా!

23-10-201923-10-2019 12:38:22 IST
Updated On 23-10-2019 14:24:10 ISTUpdated On 23-10-20192019-10-23T07:08:22.423Z23-10-2019 2019-10-23T07:08:07.835Z - 2019-10-23T08:54:10.676Z - 23-10-2019

మీడియా ఆంక్షల జీవో లీక్ పై జగన్ గుస్సా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ వర్గం మీడియాకు మధ్య ఇప్పుడు పరోక్ష యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో తెలుగుదేశం పార్టీ పల్నాడులోని ఆత్మకూరులో టీడీపీ బాధితుల కోసం పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృష్ణా-గుంటూరు జిల్లాలలో కొన్ని ఛానెల్స్ ప్రసారాలను నిలిపివేయించారు. ప్రభుత్వం రామరామ మాకేమీ తెలియదన్నా మంత్రి కొడాలి నాని ఎమ్మెస్వోలతో భేటీ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొట్టడంతో ప్రభుత్వం నోటికి తాళం పడింది.

అప్పటి నుండి రాష్ట్రంలో ఆ వర్గం మీడియాపై ఇప్పటికీ అప్రకటిత బ్యాన్ కొనసాగుతూనే ఉంది. ఎమ్మెస్వోలతో పాటు ఏపీ ప్రభుత్వ సంస్థ ఫైబర్ నెట్లో కూడా ఆ చానెళ్ళను ఆపేశారు. ఏకంగా పెద్దన్న ట్రాయ్ వరకు విషయం వెళ్లి ఓ కమిటీని కూడా నియమించి డీడిశాట్ ప్రభుత్వం మీద జరిమానాకు కూడా సిద్దమవడంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు జరిమానాలు వద్దని తిరిగి వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి ఏపీ ఫైబర్ నెట్లో ప్రసారాలు ప్రారంభంకాగా ఎమ్మెస్వోల నుండి కూడా త్వరలోనే తిరిగి ప్రసారాలు పునరుద్ధరణ కానున్నాయి.

వార్తా ఛానెళ్లను అనధికారిక బ్యాన్లతో పనికాదని అనుకున్నారేమో కానీ ఏకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తే కేసులు పెట్టి చర్యలు తీసుకొనేలా చట్టం చేయాలని ప్రభుత్వం ఓ జీవోను తయారుచేసింది. ఈమేరకు క్యాబినెట్ భేటీ చర్చ జరిపి నిర్ణయాలు కూడా తీసేసుకున్నట్లు తెలిసింది. నిజానికి ఆ జీవో చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సింది. క్యాబినెట్ అంటేనే కాన్ఫిడెన్షియల్ కాగా అందునా ఆజీవో ఇంకా గోప్యంగా ఉండాల్సింది. కానీ క్యాబినెట్ భేటీ పూర్తయిందో లేదో జీవో బయటకు వచ్చేసింది.

వ్యతిరేక వార్తలు రాసే పత్రికలు, ప్రసారం చేసే ఛానెళ్లపై చర్యలు తీసుకొనే అధికారం ప్రభుత్వశాఖ కార్యదర్శికి అప్పగించాలని పేర్కొన్న ఆ జీవో బయటకు రావడంతో మీడియాలో ఒక్కసారిగా గుప్పుమంది. సోషల్ మీడియా లో జీవో తెగ చక్కర్లు కొట్టగా మీడియా ప్రతినిధులు అంతెత్తున లేచారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు ఆ జీవో బయటకు ఎలా వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం కూడా ఆ జీవో బయటకు ఎలా లీకైందంటూ కూపీలు లాగడం మొదలుపెట్టారు.

జీవోపై చర్చ జరిగిన సమయంలో ఉన్న అధికారులు, నేతలు ఎవరికి వారు తమకు తెలియదంటూ తప్పించుకుంటున్నా ఓ ఐదుగురు వ్యక్తుల మీద పెద్దలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. కుట్ర పూరితంగానే జీవోను బయటకు లీక్ చేశారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుండగా ఎలాగైనా ఆ లీకు వీరుడిని పట్టుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ ఒక్క జీవోను తేలికగా తీసుకోకూడదని ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటే మరోసారి లీకులు లేకుండా ఉంటాయని భావిస్తున్నారు.

కాగా గతంలో జగన్ తండ్రి వైఎస్ఆర్ 2007లో కూడా ఆ తరహా జీవోను తయారుచేసి చివరికి వెనక్కు తగ్గారు. ఆ జీవోపై తీవ్ర వ్యతిరేకతలు రావడంతో చివరికి వైఎస్ఆర్ తనకు తెలియకుండా తన క్యాబినెట్లో జరిగిపోయిందని చెప్పుకోవాల్సి  వచ్చింది. కాగా ఇప్పుడు జగన్ కూడా జీవో అయితే తయారు చేసి చర్చకు పెట్టారు. మరి దానిపై నిర్ణయం తీసుకుంటారా?..నిర్ణయం తీసుకోకముందే సంచలనంగా మారిన జీవోపై సీఎం ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తిగా మారింది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle