newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

మీడియాపై కత్తి జీవో.. సర్కారుకు హైకోర్టు షాక్

28-11-201928-11-2019 09:27:22 IST
2019-11-28T03:57:22.848Z28-11-2019 2019-11-28T03:57:19.483Z - - 05-08-2020

మీడియాపై కత్తి జీవో.. సర్కారుకు హైకోర్టు షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2430 గురించి అందరికీ తెలిసిందే. అయితే అది నెంబర్ ఆధారంగా కన్నా మీడియాపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధించిన ఆంక్షల జీవో అంటేనే సామాన్య ప్రజలకు సులభంగా అర్ధమవుతుంది. గత నెలలో విడుదల చేసిన ఆ జీవో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేంద్ర ప్రభుత్వం కానీ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీడియాపై ఈ తరహా ఆంక్షలు విధించలేదు.

ఆధారం లేకుండా వార్తాపత్రికలలో లేదా టీవీ ఛానెళ్లలో కానీ ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రతినిధులకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తే ఆ వార్తలకు సంబంధించిన శాఖల అధికారులే సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే చట్టమే ఈ జీవో ఉద్దేశ్యం. కానీ ఆధారాలు అందిపుచ్చుకొని వార్తలు ప్రజలకు చెప్పేలోగా పుణ్యకాలం కాస్త కరిగిపోతుందని.. ఈ జీవో మీడియా మెడపై కత్తేనని అప్పుడే తేల్చిపారేశారు.

దేశవ్యాప్తంగా మీడియా సంస్థలు ఈ జీవోను వ్యతిరేకించారు. ఆ మాటకొస్తే ఇంతకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డితో సహా మహామహులే మీడియాను నిరోధించాలని చూసి జరిగేపని కాదని వెనక్కు తగ్గిన వాళ్లే. వాటిని ఉదాహరణలో సహా పలువురు సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించినా వెనక్కు తగ్గకపోగా ఔను.. నిరాధార ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురించినా.. ప్రసారం చేసినా కేసులు తప్పవని మంత్రుల ద్వారా హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి.

కాగా ఇప్పుడు మొత్తానికి ఈ జీవో వ్యహారం హైకోర్టుకు చేరింది. మహానుభావులు అందించిన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కేలా మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా ఉన్న ఈ జీవోపై విచారణ జరపాలని ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ శ్యాం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసింది.

గతంలో రద్దైన ఓ జీవో ఆధారంగా ఈ ప్రభుత్వం మరో జీవో తేవడం ఏమిటని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం అసలు ఏ ఉద్దేశ్యంతో ఈ జీవోను తీసుకొచ్చిందో పూర్తి వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమగ్ర వివరాలతో ప్రభుత్వం మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

కాగా ఈ జీవో వ్యహారంలో ఈరోజు హైకోర్టు ధర్మాసనం స్పందించిన తీరును బట్టి న్యాయవర్గాలు ఇది ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ చేసిన ఈ జీవో పత్రికా భావప్రకటనా స్వేచ్ఛకు కొంతమేర ఆటంకం కలిగించేలా ఉందన్న అభిప్రాయం హైకోర్టులో కనిపిస్తుందని చెప్పుకొస్తున్నారు. మరి ప్రభుత్వం కౌంటర్ గా ఏ సాకు చెప్పనుందో చూడాల్సిఉంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle