‘మీడియాను బెదిరించేందుకే 2430 జీవో’ ప్రెస్ కౌన్సిల్ అభ్యంతరం
07-11-201907-11-2019 14:45:11 IST
Updated On 07-11-2019 16:27:16 ISTUpdated On 07-11-20192019-11-07T09:15:11.775Z07-11-2019 2019-11-07T09:15:05.775Z - 2019-11-07T10:57:16.814Z - 07-11-2019

ఏపీ ప్రభుత్వం తాజాగా తెరమీదకు తెచ్చిన జీవో నెంబర్ 2430పై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ స్పందించారు. ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఏపీయూడబ్ల్యూజెనేతలు ఢిల్లీలో ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ కు వినతిపత్రం అందచేశారు. మీడియాపై కేసులు వేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన 2430 జీవో మీడియా సంస్థలను, పాత్రికేయులను బెదిరించెందుకే ఉద్దేశించినట్లు కనిపిస్తోందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సి.కే.ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
జీవో 2430 పై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐ.జే.యూ., ఏ.పీ.యు.డబ్ల్యు.జే. ప్రతినిధి బృందం జస్టీస్ సి.కే.ప్రసాద్ ను కలిసి ఒక వినతి పత్రం అందచేసింది. పత్రికా వార్తల ఆధారంగా ఇప్పటికే కేసును చేపట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ నోటీసులు జారీ చేయడంపై ప్రతినిధి బృందం ధన్యవాదాలు తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఇలాంటి జీవో జారీచేయాల్సిన అవసరం లేదని, పత్రికలు అవాస్తవ కథనాలు, వార్తలు రాస్తుంటే తమకు ఫిర్యాదుచేస్తే వాటిపై విచారణ జరపడానికి ప్రెస్ కౌన్సిల్ సిద్ధంగా వుందని జస్టిస్ ప్రసాద్ అన్నారు.
ఈజీవోపై ప్రెస్ కౌన్సిల్ నిర్వహించే విచారణలో ఏపీయూడబ్ల్యూజె వాదన వింటామన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో హత్యకు గురైన జర్నలిస్ట్ సత్యనారాయణ సంఘటనకు సంబంధించి ప్రభుత్వ నివేదిక కోసం చూస్తున్నట్టు ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ తెలిపారు. ఈ ప్రతినిధి బృందంలో ఐజేయూ నేత టి.ఆంజనేయులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ కుమార్, డి.సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజె అధ్యక్షుడు ఐ.వీ.సుబ్బారావు, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మా రావు తదితరులున్నారు.
అనంతరం యూనియన్ ప్రతినిధి బృందం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తో భేటీ కావాలని నిర్ణయించింది. కానీ ఆయన విదేశీ పర్యటనలో ఉండడంతో వ్యక్తిగత కార్యదర్శికి వినతిపత్రం అందచేశారు.
జర్నలిస్టుల ప్రతినిధి బృందం పలు మీడియా సంస్థల అధిపతులను, మీడియా ప్రముఖులను కలిసి వినతి పత్రాలను అందచేసింది. జీవో పర్యవసానాలు, జర్నలిస్టుల ఆందోళన గురించి వారికి వివరించింది. ఐ.జే.యు. అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు ఏం.ఏ.మాజిద్, ఐ.జే.యు. మాజీ అధ్యక్షులు ఎస్.ఎన్. సిన్హా, తదితరులు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.


సీఎం జగన్ ను అభాసుపాలు చేస్తున్న ఢిల్లీ ప్రతినిధులు
6 minutes ago

పోలీసులు సకాలంలో స్పందిస్తే జరిగేది ఇదే...!
21 minutes ago

పోలీసులపై పూల వర్షం. దేశమంతా హర్షధ్వానాలు..
36 minutes ago

బీజేపీలోకి మరో సీనియర్ హాస్య నటుడు..?
an hour ago

సజ్జనర్ సీన్ రిపీట్ చేశారు..?!
3 hours ago

వారి కంటే ముందే కలుస్తారా..?
3 hours ago

పవన్ అభిమాని అత్యుత్సాహం.. ఏ రెడ్డి తలైనా నరుకుతా!
18 hours ago

ఎంఐఎంకి కీలక పదవి.. పీఏసీ ఛైర్మన్గా అక్బరుద్దీన్ నియామకం
19 hours ago

అమరావతి వార్: వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలు
19 hours ago

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల లిస్ట్.. ఎక్కడో తేడా కొట్టేస్తుందే?!
20 hours ago
ఇంకా