newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

మీడియాకు దూరంగా జగన్ - కారణమిదేనా?

07-10-201907-10-2019 12:49:49 IST
Updated On 07-10-2019 16:00:21 ISTUpdated On 07-10-20192019-10-07T07:19:49.665Z07-10-2019 2019-10-07T07:19:44.580Z - 2019-10-07T10:30:21.276Z - 07-10-2019

మీడియాకు దూరంగా జగన్ - కారణమిదేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్ జగన్మోహనరెడ్డి...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.  మాట తప్పడు, మడమ తిప్పడు. వందేళ్ల పైబడిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో హోదాను, పదవిని తృణ ప్రాయంగా వదిలేసి...నచ్చని ఉద్యోగం చేయలేనన్న ఒక్క మాటతో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాటను సైతం లెక్క చేయలేదు.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన కాంగ్రెస్ తో, తెలుగుదేశంతో, బీజేపీతో ఒకే సారి పోరాడారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా జనంతో మమేకమయ్యారు. 

చారిత్రాత్మక విజయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే గతానికి, ఇప్పటికీ ఆయనలో ఒక తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. గతంలో జనం సమస్యలను, జాతీయ సమస్యలను, తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను మీడియా సమావేశాల్లో ఎండగట్టేవారు. జాతీయ మీడియాను పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చే వారు. అయితే ముఖ్యమంత్రిగా ఆయన మీడియాకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు. హస్తిన పర్యటనలలో సైతం మీడియాతో మాట్లాడటం లేదు.

విపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనపై ఒక విమర్శ ఉండేది. ప్రాంతీయ మీడియా (ఏపీ ప్రెస్)తో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరని, అయితే జాతీయ మీడియాలో మాత్రం ఎక్కువగా  ఇంటర్వ్యూలు, అభిప్రాయాలు వచ్చేవి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఆ మీడియాను కూడా దగ్గరకు రానివ్వడం లేదు? ఎందుకన్నది సహజంగానే ప్రజలలోనే కాదు పరిశీలకులలో కూడా ఉత్కంఠ రేపుతున్న అంశం. ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు హస్తినలో పర్యటించిన ఆయన కేవలం ఒక్కసారంటే ఒక్కసారి మాత్రమే అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు.  

హస్తిన పర్యటన నుంచి ఏపీకి తిరిగి వచ్చిన తరువాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. సహజంగానే ఏపీ సీఎంగా ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి రాగానే అందరూ ముఖ్యమంత్రి  అక్కడి విశేషాలు చెబుతారు. ప్రధానితో, మంత్రులతో భేటీలో చర్చించిన అంశాలేమిటి? అక్కడ నుంచి వచ్చిన స్పందన ఏమిటి? కేంద్రాన్ని రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం ఏం సహకారం కోరారు? ఇత్యాది అంశాలపై సహజంగానే ప్రజలలో ఆసక్తి ఉంటుంది. ముఖ్యమంత్రి ఆ వివరాలన్నీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తారన్న భావన ఉంటుంది. అయితే ముఖ్యమంత్రిగా జగన్ మాత్రం మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు. పెద్దగా మీడియా ముందుకే రావడం లేదు.

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణంలో జాప్యం తదితర అంశాలపై మీడియా నుంచి ప్రశ్నలు ఎదురౌతాయన్న ఉద్దేశంతో ఆయన మీడియాను దూరం ఉంచుతున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజులలో ప్రత్యేక హోదాపై కేంద్రంతో పోరాడే శక్తి లేదు అన్న ఒక్క మాటతో జగన్ ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పారనీ, మడమ తిప్పారనీ విపక్షాలు విమర్శలు చేశాయి. వాటిని మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ప్రసారం చేసింది. 

బహుశా ఆ కారణంగానే ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదాపై తమ వైఖరి ఏమిటన్నది వెల్లడించలేని కారణంగా ఆయన మీడియాను దూరంగా పెట్టారన్న భావన వ్యక్త మౌతున్నది. అదే విపక్ష నేతగా ఆయన మీడియాతో...ప్రత్యేకించి జాతీయ మీడియాతో చాలా తరచుగా మాట్లాడేవారు. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను తూర్పారపట్టేందుకు మీడియానే ఆయనకు సాధనంగా మారింది. సీఎం అయిన తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చి విపక్షం పై విమర్శలు చేయడం కంటే...ప్రభుత్వాధినేతగా తానేం చేశానన్నది ప్రధానంగా చెప్పుకోవలసి ఉంటుంది. ఆ బాధ్యతను మంత్రులకు అప్పగించేసి జగన్ మీడియాను దూరం ఉంచడానికి కారణం ఏమిటన్నదానిపై వైకాపా శ్రేణులకు కూడా సమాచారం లేదు.

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీల విషయంలో కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకువస్తున్నారన్న ప్రశ్నలను ఎదుర్కొనడం ఇష్టంలేకనే జగన్ మీడియాకు దూరంగా ఉంటున్నారన్న భావన ప్రజలలో వ్యక్తమౌతున్నది. అధికారం చేపట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ కూడా ముఖ్యమంత్రిగా జగన్ విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చినది లేదు. దానిపై దృష్టి పెట్టిందీ లేదు. ఆ కారణంగానే జగన్ మీడియా ముందుకు రావడం లేదా అన్న అనుమానాలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. వీటిని నివృత్తి చేయాల్సినది ముఖ్యమంత్రే.

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   19 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   21 hours ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   21 hours ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   a day ago


డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

   a day ago


ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

   a day ago


శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

   a day ago


చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

   23-05-2020


వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

   23-05-2020


ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

   23-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle