newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

25-05-202025-05-2020 08:33:32 IST
2020-05-25T03:03:32.890Z25-05-2020 2020-05-25T03:03:23.013Z - - 13-07-2020

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయిడు విశాఖ పర్యటన వాయిదా పడింది. ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ మృతుల కుటుంబాలు, బాధితులను పరామర్శించేందుకు సోమవారం ఆయన అక్కడ పర్యటించాల్సి ఉంది. 

రాష్ట్రంలో విమానాల ప్రారంభం రెండు రోజులపాటు జాప్యం కావడంతో ఆయన విశాఖ వెళ్లలేకపోయారు. విశాఖ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు.  తొలుత హైదరాబాద్‌ నుంచి సోమవారం విమానంలో విశాఖపట్నం వెళ్లేందుకు, అక్కడి నుంచి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు వీలుగా ఆయన షెడ్యూల్‌ నిర్ణయించుకున్నారు. 

27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాలకు అమరావతి నుంచే హాజరుకానున్నారు. మంగళగిరి సమీపంలోని ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి మహానాడు సందేశమివ్వనున్నారు. గతంలో నిర్ణయించిన దాని ప్రకారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు చంద్రబాబు చేరుకొని  అక్కడినుంచి వెంకటాపురం గ్రామంలో  స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమై అనంతరం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ప్రాంతాల్లో పర్యటించాలని భావించారు.

సాయంత్రం రోడ్డుమార్గంలో అమరావతి నివాసానికి చంద్రబాబు బయలుదేరి వెళ్ళాల్సి వుంది. రెండురోజుల క్రితమే చంద్రబాబు పర్యటనకోసం అనుమతి కోరారు. కానీ అనుమతి లభించలేదు. చివరకు రోడ్డుమార్గంలోనే చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతి రానున్నారు. లాక్ డౌన్ అమలులో వున్నందును హైదరాబాద్ లోనే వుండిపోయిన చంద్రబాబునాయుడు ఏపీకి ఎందుకు రావడం లేదని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాకకోసం భారీ ఏర్పాట్లు చేశారు టీడీపీ నేతలు. 

మరోవైపు బాబు టూర్ ని అడ్డుకునేందుకు జగన్ సర్కార్ వైజాగ్ కి విమానాలు రాకుండా చేసిందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. డీజీపీ అనుమతి ఇచ్చినా చంద్రబాబుపై అక్కసుతో జగన్ ఈ పనిచేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle