newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

మారనున్న విద్యావిధానం.. స్కూల్స్‌లో నయారూల్స్

06-06-202006-06-2020 09:58:46 IST
Updated On 06-06-2020 10:49:00 ISTUpdated On 06-06-20202020-06-06T04:28:46.030Z06-06-2020 2020-06-06T04:27:47.764Z - 2020-06-06T05:19:00.675Z - 06-06-2020

మారనున్న విద్యావిధానం.. స్కూల్స్‌లో నయారూల్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో విద్యావిధానంలో కీలకమార్పులు తప్పడం లేదు. తాజాగా ఏపీలో మార్గదర్శకాలు విడుదలచేసింది ప్రభుత్వం. తరగతి గదిలో 30మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే రెండు విడతలుగా తరగతులు నిర్వహించనున్నారు. 

సాధారణ పరిస్థితులు వచ్చే వరకు మధ్యాహ్న భోజన పథకం కింద సరకుల పంపిణీ జరుగుతుంది. కరోనా వైరస్‌ వ్యాప్తితో వచ్చే విద్యా సంవత్సరంలో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు ఇచ్చింది. పాఠశాల తెరిచే సమయంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. పాఠశాల ఆవరణ కరోనా వైరస్‌ రహితంగా శుద్ధి చేస్తారు. ప్రవేశ ద్వారం వద్ద విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతల పరిశీలన చేశాకే లోనికి అనుమతిస్తారు. 30మంది పిల్లలకు రెండు చొప్పున ఆటోమేటెడ్‌ చేతులు కడిగే యంత్రాల ఏర్పాటు చేస్తారు. 

విద్యార్థులు, ఉపాధ్యాయులకు క్లాత్ మాస్కులు అందిస్తారు. ఒకేరకం దుస్తులతోపాటు చేతిరుమాలు కూడా వుంటుంది. సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో వుంచనున్నారు. తగిన జాగ్రత్తలతో తరగతుల నిర్వహణ చేపట్టాలని, ఉదయం నిర్వహించే సామూహిక ప్రార్థన రద్దు చేసి తరగతి గదిలో మైకుల ద్వారా ప్రార్థన చేయిస్తారు. 30మంది విద్యార్థులు మించి ఉంటే ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 12.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండు విడతల్లో క్లాసులు నిర్వహించనున్నారు. 50నుంచి 100మంది ఉంటే రోజు విడిచి రోజు క్లాసులు వుంటాయి. మొదటి రోజు కొందరికి రెండు విడతలు, మరుసటి రోజు రెండు విడతల్లో మరి కొందరికి తరగతులు వుంటాయి. తాగునీరు, మధ్యాహ్న భోజనానికి విడతకు 10  మందికే అనుమతిస్తారు. 

ప్రతి రోజు 15నిమిషాలు కొవిడ్‌-19 నివారణ చర్యలపై క్లాస్ వుంటుంది. ఆటల పీరియడ్ వుండదు.  వ్యక్తిగత వ్యాయామాలు, యోగా వుంటుంది. నో స్కూల్‌ బ్యాగ్‌ డే అమలుచేస్తారు. దీని ద్వారా పిల్లల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తారు. పరీక్షల్లో గదికి 10 మంది మాత్రమే..పరీక్ష కేంద్రాల వద్ద శరీర ఉష్ణోగ్రతల  పరిశీలన జరుపుతారు. ఒక్కో గదిలో 10మందిని మాత్రమే పరీక్షకు అనుమతి.

కంటైన్ మెంట్ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తారు. కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉండే వారి కోసం ప్రత్యేక ఐసొలేషన్‌ గది ఏర్పాటుచేస్తారు. పరీక్షా మూల్యాంకన కేంద్రాలను జిల్లాస్థాయిలో ఏర్పాటుచేస్తారు. 

ఇటు డిజిటల్ క్లాసులకి ప్రైవేట్ స్కూళ్ళ మొగ్గుచూపుతున్నాయి. కరోనా ప్రభావంతో పాఠశాలలు రూపు మారనున్నాయి.  వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంతేకాదు ఇకనుంచి క్లీన్ అండ్ గ్రీన్ స్కూళ్ళు కనిపించనున్నాయి. మొత్తం మీద కరోనా ప్రభావంతో స్కూళ్లు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. విద్యార్ధుల ఆరోగ్యమే ప్రధానంగా ముందుకు సాగనున్నాయి. 

 

 

 

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

   29 minutes ago


పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

   44 minutes ago


పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

   an hour ago


ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

   an hour ago


రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

   an hour ago


అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

   an hour ago


బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

   2 hours ago


విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

   14 hours ago


టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

   21 hours ago


కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle