newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

17-02-202017-02-2020 15:13:34 IST
2020-02-17T09:43:34.194Z17-02-2020 2020-02-17T09:43:30.537Z - - 07-04-2020

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నాలుగు ప్రాంతాలలో తెలివైన ప్రజలు ఎక్కడ ఉన్నారు అంటే అందరూ ఏపీ గురించే చెప్తారు. అటు ఉత్తరాంధ్ర నుండి సీమ వరకు.. ముఖ్యంగా దక్షణ కోస్తాలో కూడా బడా బడా వ్యాపారవేత్తలు.. పెట్టుబడి దారులు ఉంటారని పేరుంది. ఇక ప్రజలు కూడా తెలివిగా అలోచించి నిర్ణయాలు తీసుకుంటారని యావత్ దేశంలోనే ఏపీ ప్రజలకు ఓ బ్రాండ్ ఉంది. అయితే, అది గతమేమో అనిపిస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చేస్తున్న మాయామశ్చీంద్రలలో పడి ఏపీ ప్రజలు తమ తెలివిని అటకెక్కించారనిపిస్తుంది. కులం, మతం, ప్రాంతం, వ్యక్తి పూజ, కక్షసాధింపులు, ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడంలో జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఏపీ ప్రజలను తొలి బొమ్మలాట ఆడించేస్తుందంటే ఆశ్చర్యం అనుకోవాల్సిన అవసరం లేదు.

రాష్ట్రంలో గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులను కొట్టేందుకు కొన్ని ఆయుధాలను ఉపయోగిస్తే.. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబును చావుదెబ్బ తీసేందుకు అన్ని ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. మంది బలం దండిగా ఉన్న వైసీపీ పార్టీకి ఇప్పుడు పందిని నందని నమ్మించడం కూడా సులువైపోగా ప్రతిపక్ష టీడీపీ చావుదప్పి కన్నులొట్టపోయేలా విషప్రచారం నుండి బయటపడేందుకు రకరకాల తిప్పలు పడుతుంది.

ఒకపక్క రాష్ట్రంలో పెన్షన్ల వెరిఫికేషన్.. పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే రేషన్ కార్డుల ఏరివేతతో ఓ వర్గం ప్రజలు సతమతమవుతుంటే.. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు కొన్ని జిల్లాలలో ప్రభుత్వమే అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని మరికొంత మంది పేదల కడుపుకొడుతుంది. మరోవైపు వ్యవసాయ పరిశ్రమకి సంబంధించి రాయతీలు అన్న ఊసేలేదు. ఉద్యోగాల సంగతి అసలు తలచుకోకుంటేనే మంచింది.

రాజధాని తరలింపుకి సిద్దమైన ప్రభుత్వంలో అసలు పోలవరం లాంటి జీవనాడి ఎక్కడ ఉందో చెప్పేందుకు ప్రభుత్వంలో ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రజలకు కూడా ఆ అంశాలపై అసలు ఆసక్తే లేదేమో అనిపిస్తుంది. తనపై ఉన్న అవినీతి కేసులు ఎంతవరకు వచ్చాయి.. సీఎం జగన్ కోర్టుకి వెళ్తారా లేదా అని ఒక వర్గం ఆరాలు తీసుకుంటే చంద్రబాబుకి కూడా అవినీతి మరక అంటుకుంటే ఎలా ఉంటుందా అని మరో వర్గం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా అన్ని పార్టీలు ప్రజల చెవులలో పెద్ద పెద్ద తామర పువ్వులు పెట్టేసి అసలు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏంటన్నది తెలియకుండా చేస్తుంటే నిశితంగా గమనించిన మేధావి వర్గం ఈసడించుకొని రాష్ట్రాన్ని వదిలి పొరుగు రాష్ట్రాలకి పొలోమంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిలకు మార్కులేసిన సో కాల్డ్ మేధావులు తేలుకుట్టిన దొంగలై మీడియాకు మొహం చాటేస్తున్నారు. అదీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం పరిస్థితి!

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   4 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   9 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   9 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   11 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   14 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   14 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   14 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   15 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   17 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle