newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

మాధ‌వ్ గారూ.. కాస్త మారండి సార్‌..!

09-08-201909-08-2019 17:31:10 IST
2019-08-09T12:01:10.432Z09-08-2019 2019-08-09T12:01:07.122Z - - 20-10-2019

మాధ‌వ్ గారూ.. కాస్త మారండి సార్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ దూకుడు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త స‌మ‌స్య‌లు తెచ్చి పెడుతోంది. ఆరు నెల‌ల కింది వ‌ర‌కు సీఐగా ప‌నిచేసిన మాధ‌వ్ ఇప్పుడు పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఉన్నారు. అయితే, ఆయన వ్య‌వ‌హార శైలి మాత్రం ఇంకా పోలీస్‌గానే ఉంటోంది. ఆయ‌న వ్యాఖ్య‌లు పార్టీకి ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి. తాజాగా కియా తొలి కారు విడుద‌ల సంద‌ర్భంగా మాధ‌వ్ వ్యాఖ్య‌లు వైసీపీని ఇరుకున పెట్టేలా ఉన్నాయి. ప్ర‌భుత్వాన్ని విమర్శించేందుకు తెలుగుదేశం పార్టీకి అవ‌కాశంగా మారాయి.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే రౌడీరాజ్యం వ‌స్తుంద‌ని, పెట్టుబ‌డులు రావ‌ని, పారిశ్రామిక‌వేత్త‌లు బ‌య‌ప‌డ‌తారని ఎన్నిక‌ల ముందు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ పెద్ద ఎత్తున పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించి త‌న‌పై చేసిన విమ‌ర్శ‌ల‌ను ప‌టాపంచ‌లు చేయాల‌ని భావిస్తున్నారు. ఇవాళ విజ‌య‌వాడ‌లో 35 దేశాల ప్ర‌తినిధుల‌తో డిప్ల‌మెటిక్ ఔట్‌రీచ్ కార్య‌క్ర‌మాన్ని సైతం నిర్వ‌హించిన ఆయ‌న రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరారు.

పెట్టుబ‌డుల‌కు రాష్ట్రం అనువైన‌ద‌ని, ఏపీకి ఉన్న సానుకూల‌త‌లను వారికి వివ‌రించి ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, జ‌గ‌న్ చేసిన ఈ ప్ర‌చారం కంటే గోరంట్ల మాధ‌వ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై వ్య‌తిరేక ప్ర‌చార‌మే ఎక్కువ జ‌రుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మాధ‌వ్ వ్యాఖ్య‌ల‌ను బాగా హైలెట్ చేస్తోంది. స్థానికుల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌డం లేద‌ని కియా సంస్థ‌పై మాధ‌వ్ ఆరోప‌ణ‌లు చేశారు. కారు ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి అతిథిగా హాజ‌రైన ఆయ‌న అదే కార్య‌క్ర‌మంలో త‌న నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఏకంగా తొలి కారుపై ఈ విష‌యాన్ని రాశారు. సంస్థ ప్ర‌తినిధిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కియా సంస్థ మెడ‌లు వంచుతామ‌ని హెచ్చ‌రించారు. ఆయ‌న సీఐగా ఉన్న‌ప్పుడు ప్ర‌వ‌ర్తించిన లానే ఇప్పుడూ ప్ర‌వ‌ర్తించారు. ఈ వ్యాఖ్య‌లపై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా టీడీపీ శ్రేణులు మాధ‌వ్ వ్యాఖ్య‌ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం మొద‌లుపెట్టారు. మాధ‌వ్ క్ష‌మాప‌ణ కోరాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, కియా సంస్థ స్థాపించినా స్థానికుల‌కు పెద్ద‌గా ఉద్యోగాలు ద‌క్క‌లేద‌నేది నిజ‌మే. అయితే, ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పిన తీరు మాత్రం స‌రిగా లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇంత‌కుముందు కూడా ఆయ‌న పార్ల‌మెంటులో రైతుల క‌ష్టాలపై మాట్లాడుతూ కొంత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఉద్దేశ్యం, ఆయ‌న బాధ‌లో వాస్త‌వం ఉండ‌వ‌చ్చు కానీ అది వెల్ల‌డించిన తీరు మాత్రం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.

ఇది ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు సైతం ఇబ్బందిగా మారింది. డ‌బ్బుల కోస‌మే కియాను బెదిరిస్తున్నార‌ని నారా లోకేష్ ఇదే అదునుగా ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. మ‌రి, మాధ‌వ్ వ్యాఖ్య‌లపై జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే, మాధ‌వ్ స్పీడ్ త‌గ్గించుకోక‌పోతే మాత్రం మ‌రిన్ని స‌మ‌స్య‌లు త‌ప్పేలా లేవంటున్నారు విశ్లేష‌కులు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle