newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

20-11-201920-11-2019 13:04:06 IST
2019-11-20T07:34:06.145Z20-11-2019 2019-11-20T07:33:55.300Z - - 15-12-2019

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంతెత్తున ఎగురుతున్న విషయం తెలిసిందే. ఆ విషయం తెలిసి కూడా పార్లమెంటులో మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్న రాజ్యాంగంలోని 350, 350ఎ అధికరణల గురించి ప్రస్తావించిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు అధినేత జగన్‌కే కాకుండా తోటి ఎంపీలకు కూడా షాక్ తెప్పించారు. మంగళవారం లోక్‌సభలో వైకాపా ప్రభుత్వ వైఖరికి భిన్నంగా మాట్లాడారంటూ జగన్ తమ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. తాను తప్పేమీ మాట్లాడలేదని ఎంపీ కృష్ణంరాజు వివరణ ఇవ్వటం వెంటవెంటనే జరిగిపోయాయి.

పార్లమెంటులో వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రసంగం ఆ పార్టీ అధినేతకు, తోటి ఎంపీలకు అర్థం కాలేదా.. విమర్శల పాలైన ఎంపీ అవుననే చెబుతున్నారు. ఇంతకూ పార్లమెంటులో ఏం జరిగింది? ప్రాచీన భాషా కేంద్రాన్ని మైసూరు నుంచి ఏపీకీ మార్చడం గురించిన ప్రశ్నపై చర్చ జరిగినప్పుడు తాను మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం గురించి రాజ్యాంగంలోని అధికరణలను ప్రస్తావిస్తూ మాట్లాడాను తప్ప ఇంగ్లీషు మీడియం వద్దని కానీ, తెలుగు మీడియమే కావాలని కానీ చెప్పలేదని, తన ప్రసంగంలో ఇంగ్లీషు అనే పదమే రానప్పుడు ఇంతగా అపార్థం చేసుకున్నారెందుకు అని వైకాపా ఎంపీ మథనపడ్డారు. 

లోక్ సభలో రఘురామ కృష్ణం రాజు మాట్లాడిన మాటల సారాంశం ఇది. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుకు అన్యాయం చేస్తోందని, తెలుగు మీడియం తీసేస్తోందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. అయితే... జగన్‌ సీఎం అయ్యాక తెలుగుకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, తెలుగు వారికి గర్వకారణమైన ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ అధ్యక్షురాలిగా నియమించారని చెప్పాను. తెలుగు అకాడమీ విభజన ఇంకా జరగలేదని, ఆస్తుల విభజన జరిగితే ఏపీకి రూ.200 కోట్లు వస్తాయని కేంద్రం దృష్టికి తెచ్చాను. మాతృ భాషకు సంబంధించి రాజ్యాంగంలోని 350, 350ఏ ప్రకారం కేంద్రమే ఈ బాధ్యత తీసుకోవాలని అన్నాను. ఇంతకుమించి ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు’’ అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 

మరి అపార్థం ఎందుకు చోటు చేసుకుంది? అంటే తెరవెనుక ఘటనలు దీనికి కారణంగా చెబుతున్నారు. రఘురామ కృష్ణంరాజు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారంటూ జగన్‌ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి సమాచారం ఇవ్వకుండా కేంద్ర మంత్రులను, ప్రధానిని కలుస్తున్నారని... దీనిని దృష్టిలో ఉంచుకునే మొన్న ఎంపీలతో జరిగిన భేటీలో పరోక్ష హెచ్చరికలు చేశారని చెబుతున్నారు. ఈలోపే మాతృభాషపై ఎంపీ చేసిన ప్రసంగం జగన్‌కు మరింత ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.

దాంతో వెనుకా ముందూ చూసుకోకుండా ‘ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకంగా పార్టీ నేతలు ఎవరు మాట్లాడినా చర్యలుంటాయి’ అని ముఖ్యమంత్రి జగన్‌ హెచ్చరించినట్లు తెలిసింది. పేద పిల్లల అభ్యున్నతి కోసమే పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెడుతున్నామని చెబుతూ... లోక్‌సభలో తమ ప్రభుత్వ వైఖరికి భిన్నంగా మాట్లాడిన ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడి... రఘురామ కృష్ణంరాజు వివరణ తీసుకోవాలని ఆదేశించినట్లు మంగళవారం రాత్రి వార్తలు వచ్చాయి. 

పార్లమెంటులో తాను ఆంగ్లంలో చేసిన ప్రసంగాన్ని అర్థం చేసుకోలేక జగన్‌కు ఎవరైనా తప్పుగా చెప్పారేమోనని వైకాపా ఎంపీ సందేహం వ్యక్తం చేశారు. తననెవరూ సంజాయిషీ అడగలేదని... అడిగితే వివరణ ఇస్తానన్నారు. నన్ను సంజాయిషీ అడిగితే వీడియోలతో సహా వివరణ ఇస్తాను. ఆ బాధ్యత నాపై ఉంది. అలాగే... నన్ను అపార్థం చేసుకుంటే, అర్థం చేసుకోవాల్సిన బాధ్యత వారిపైనా ఉంటుంది’’ అంటూ ఎంపీ వివరణ ఇచ్చారు. 

మొత్తం మీద ఇంగ్లిషు మాధ్యమం విషయంలో పేద, ధనికలు మధ్య సమస్యగా చిత్రీకరించి రాష్ట్రంలో ప్రతిపక్షాలను నోరు మూయించిన వైకాపా అధినేత తన సొంత ఎంపీలు మాతృభాష ప్రాధాన్యత గురించి సందర్భవశాత్తూ లోక్ సభలో ప్రస్తావించినా సహించకపోవడం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా వణికిస్తోంది.. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle