newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

మాణిక్యాలరావు మృతికి పలువురి సంతాపం

01-08-202001-08-2020 17:45:35 IST
Updated On 01-08-2020 18:36:19 ISTUpdated On 01-08-20202020-08-01T12:15:35.538Z01-08-2020 2020-08-01T12:13:31.608Z - 2020-08-01T13:06:19.097Z - 01-08-2020

మాణిక్యాలరావు మృతికి పలువురి సంతాపం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ మంత్రి మాణిక్యాల రావు మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు చంద్రబాబునాయుడు. 20రోజులుగా చికిత్స పొందుతున్న మాణిక్యాలరావును కాపాడుకోలేక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో దేవాలయాల అభివృద్దికి, అర్చకుల సంక్షేమానికి పాటుబడ్డారు. శాసన సభ్యునిగా తాడేపల్లి గూడెం అభివృద్దికి ఎనలేని కృషి చేశారన్నారు. నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం కట్టుబడి పని చేశారని చంద్రబాబు కొనియాడారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మాఱిక్యాలరావుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

మాణిక్యాలరావు ఆకస్మిక మృతికి తీవ్ర సంతాపం తెలిపారు ఏపీ ఇన్ ఛార్జి సునీల్ దేవదర్, బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి. 20 సంవత్సరాల పాటు ఆయనతో కలిసి పనిచేసిన సమయంలో వారికి పార్టీ పట్ల నిబద్ధత క్రమశిక్షణ అంకిత భావాన్ని నేను మర్చిపోలేనని. ఆయన మనమధ్య లేరనే విషయాన్ని సగటు కార్యకర్తగా నమ్మలేకపోతున్నానన్నారు.

ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు విష్ణువర్థన్ రెడ్డి. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు రాష్ట్ర మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. ఆయన ఆకస్మిక మృతి బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబసభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానని శిద్దా రాఘవరావు.

మాణిక్యాలరావు మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి. ఏపీ బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆకస్మిక మృతి కలచివేసింది. ఆయన లేని లోటు పార్టీకి తీరనిది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఒక ప్రకటనలో ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలసి పని చేసానన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి. మాణిక్యాలరావు మంచిస్నేహశీలి, చిత్తశుద్ధి, నిబద్ధతతో ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా పనిచేశారన్నారు. మాణిక్యాలరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. 

 కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

కోవిడ్ 19 బారిన పడ్డ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్

   3 hours ago


నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

నెలరోజుల వర్షం అయిదు రోజుల్లో కురిసింది... నిండా మునిగిన ముంబై

   3 hours ago


కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

   5 hours ago


జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

జగ్గారెడ్డి చొరవతో దుబ్బాక ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా?

   6 hours ago


ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

ఏపీలో 12 మంది సబ్ కలెక్టర్ల నియామకం

   6 hours ago


కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

కొత్తగా 2207 కేసులు.. 75వేలు మార్కు దాటిన తెలంగాణ

   6 hours ago


బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

   6 hours ago


జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

జైలునుంచి విడుదలైన జేసీ.. తాడిపత్రిలో చేదు అనుభవం

   7 hours ago


ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా విజృంభణ.. అనపర్తి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

   7 hours ago


తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.... మొబైల్ టెస్టింగ్ ల్యాబ్

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.... మొబైల్ టెస్టింగ్ ల్యాబ్

   8 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle