newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

మాజీ ఎమ్మెల్యే అనిత‌కు చంద్ర‌బాబు బిగ్ షాక్‌..!

20-10-201920-10-2019 08:02:59 IST
2019-10-20T02:32:59.452Z20-10-2019 2019-10-20T02:32:00.348Z - - 14-11-2019

మాజీ ఎమ్మెల్యే అనిత‌కు చంద్ర‌బాబు బిగ్ షాక్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్న అతి త‌క్కువ కాలంలోనే ఆ పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న మ‌హిళా నేత‌ల్లో వంగ‌ల‌పూడి అనిత ఒక‌రు. 2014లో పాయ‌క‌రావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనిత అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లవ‌ర్షం కురిపిస్తూ టీడీపీ అధిష్టానానికి మ‌రింత‌ ద‌గ్గ‌ర‌య్యారు.

కాగా, ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు అనిత‌పై టీడీపీ శ్రేణుల్లో ఓ రేంజ్‌లో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఆఖ‌ర‌కు ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్ద‌న్న ఫిర్యాదులు పార్టీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళ్లాయి. దీంతో అధిష్టానం ఏకంగా అనిత పోటీచేసే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్నే మార్చేసింది. అంత‌వ‌ర‌కు కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వ‌హించాల‌నుకున్న మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్‌ను కృష్ణా జిల్లాకు పంపించిన అధిష్టానం అనిత‌కు ఆ టికెట్‌ను కేటాయించి విదాన్ని స‌ర్దుమ‌ణింగిచేందుకు ప్ర‌య‌త్నించింది.

కాలం క‌లిసిరాని అనిత‌కు వైసీపీ ప్ర‌భంజ‌నంతో అనిత బ‌రిలో నిలిచిన‌ కొవ్వూరులో టీడీపీ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూడాల్సిన ప‌రిస్థితి. అలాగే,  పాయ‌క‌రావుపేట‌లోను టీడీపీకి గ‌ట్టి షాకే త‌గిలింది. అయితే, మొన్న‌టి ఎన్నిక‌ల్లో కృష్ణా జిల్లా తిరువూరు నుంచి పోటీచేసిన మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ తిరిగి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చారు. కొవ్వూరులో తిరిగి ప‌ట్టు సాధించేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు. అటు పాయ‌క‌రావుపేట ఇన్‌చార్జిగా ఉన్న బంగార‌య్య కూడా నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌దైన శైలిలో దూసుకెళ్తున్నారు.

ఇలా రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప్లేస్ ఖాళీ లేక‌పోవ‌డంతో అనిత‌కు నియోజ‌క‌వ‌ర్గమ‌న్న‌దే లేకుండా పోయింది. పుట్టినిల్లు పాయ‌క‌రావుపేట‌లో కొత్త నేత వ‌చ్చి పాగా వేశారు. మెట్టినిల్లు కొవ్వూరులో పాత నేత వ‌చ్చి మ‌ళ్లీ జెండాను పాతారు. దీంతో త‌న‌కో సీటు కావాలంటూ అనిత అధిష్టానం చుట్టూ రౌండ్లు కొడుతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గం లేక‌పోవ‌డంతో అనిత ప‌రిస్థితి అయోమ‌యంగా మారింది. విశాఖలో ఈ నెల 11న జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో త‌న సీటుపై క్లారిటీ వ‌స్తుంద‌ని అనిత భావించారు. పాయ‌క‌రావుపేట విష‌యంలో అటు బంగార‌య్య‌కు గానీ, ఇటు అనిత‌కు గానీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

ఓట‌మిపై కార‌ణాల‌పై విశ్లేష‌ణ‌ల వ‌ర‌కే ఆ స‌మావేశం ప‌రిమితం కావ‌డంతో అనితకు నిరాశే ఎదురైంది. పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలి వెళ్లేది లేద‌ని బంగార‌య్య బ‌లంగా వాదిస్తుండ‌గా అనిత మాత్రం కొవ్వూరు, పాయ‌క‌రావుపేట, రెండు నియోజ‌క‌వ‌ర్గాలు పుట్టినిల్లు, మెట్టినిల్లు లాంటివ‌ని చెబుతున్నారు.

మొత్తానికి ఈ పంచాయ‌తీ తేలాలంటే మ‌రికొన్ని ఆగాల్సింద‌నంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. మొత్తానికి వంగ‌ల‌పూడి అనిత‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నానంటూ చెప్పుకునేందుకు నియోజ‌క‌వ‌ర్గ‌మ‌న్న‌దే లేకుండా చేశారంటూ అధికార వైసీపీ శ్రేణులు సెటైరిక‌ల్ స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారు. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle