newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

మాజీ అధ్యక్షా... ఏంటీ ఫర్నిచర్ గోల..?

21-08-201921-08-2019 07:52:48 IST
Updated On 21-08-2019 11:47:13 ISTUpdated On 21-08-20192019-08-21T02:22:48.557Z21-08-2019 2019-08-21T02:22:03.177Z - 2019-08-21T06:17:13.694Z - 21-08-2019

మాజీ అధ్యక్షా... ఏంటీ ఫర్నిచర్ గోల..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత ఎవ‌రిపై రాన‌న్ని ఆరోప‌ణ‌లు మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుటుంబంపై వ‌స్తున్నాయి. రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న సీనియ‌ర్ నేత కోడెల శివ‌ప్ర‌సాద్ కుటుంబం ఐదేళ్ల పాటు అనేక అక్ర‌మాలు, వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న కుమారుడు కోడెల శివ‌రాం, కూతురు కూనాటి విజ‌య‌ల‌క్ష్మీపై ఇప్ప‌టికే గుంటూరు జిల్లాలో 18 కేసులు న‌మోద‌య్యాయి.

టీడీపీ హ‌యాంలో బ‌య‌ట‌కు రాని అనేక మంది తాను కోడెల బాధితుల‌ము అంటూ ఇప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారుల నుంచి కే ట్యాక్స్ వ‌సూళ్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని డ‌బ్బులు తీసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వీరిపై ప్ర‌ధానంగా వ‌చ్చాయి. ఇక‌, నిబంధ‌న‌లు ఉల్లంఘించి కేబుల్ వ్యాపారం, బైక్ షోరూంలు నిర్వ‌హించార‌నే ఆరోప‌ణ‌లు అద‌నం.

ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కూడా కోడెల కుటుంబంపై ఫిర్యాదులు చేస్తున్నారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. క‌నీసం పార్టీ పెద్ద‌లు సైతం ఈ కోడెల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు. దీంతో ఆయ‌నే ఇవ‌న్నీ క‌క్ష‌పూరితం అంటూ ఖండిస్తూ వ‌స్తున్నారు.

ఈ కేసుల‌న్నీ అటుంచితే అసెంబ్లీ ఫ‌ర్నీచ‌ర్ మాయ‌మైన వ్య‌వ‌హారం మాత్రం కోడెల‌పై ఒక మ‌ర‌క‌లా మిగిలిపోనుంది. అసెంబ్లీని హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి త‌ర‌లించే స‌మ‌యంలో కొంత ఫ‌ర్నీచ‌ర్‌, కంప్యూట‌ర్లు మాయ‌మ‌య్యాయని అసెంబ్లీ అధికారులు గుర్తించారు.

అయితే, ఇవి మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఇంట్లోకి చేర‌డం తీవ్ర వివాదంగా మారింది. అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్య‌క్తి అసెంబ్లీ నుంచి ఫ‌ర్నీచ‌ర్‌ను తీసుకొని ఇంట్లో పెట్టుకోవ‌డం ప‌ట్ల పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కోడెల సైతం ఈ విషయాన్ని అంగీక‌రించారు.

అసెంబ్లీ త‌ర‌లింపు స‌మ‌యంలో భ‌ద్ర‌త ఉండ‌ద‌నే కొన్ని వ‌స్తువుల‌ను స‌త్తెన‌ప‌ల్లిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో పెట్టుకున్నాన‌ని ఆయ‌న బాహాటంగానే ప్ర‌క‌టించారు.

అంతేకాదు ఈ వ‌స్తువులను తీసుకెళ్లాల‌ని జులై 6నే అసెంబ్లీ అధికారుల‌కు ఉత్త‌రం రాసిన‌ట్లు ఆయ‌న చెబుతున్నారు. కానీ, పాత డేటుతో ఉత్త‌రం రాసిన‌ట్లు కోడెల డ్రామాలు ఆడుతున్నార‌ని వైసీపీ ఎఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.

కోడెల సైతం ఈ ఉత్త‌రం వారికి చేరి ఉండ‌క‌పోవ‌చ్చు అనే ఓ చిన్న డౌట్ పెట్టారు. అయితే, ఇప్ప‌టికైనా ఈ సామానును తిరిగి ఇచ్చేస్తాన‌ని లేదా దాని విలువ ఎంతో చెబితే డ‌బ్బు ఇస్తానని ఆయ‌న చెబుతున్నారు.

అయితే, ఇప్ప‌టికే అనేక ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న ఆయ‌నకు ఇలా అసెంబ్లీ ఫ‌ర్నీచ‌ర్ మాయం చేసి ఇంటికి త‌ర‌లించార‌నే విమ‌ర్శ మూట‌గట్టుకోవ‌డం మాత్రం ఇబ్బందిక‌రంగా మారింది. వైసీపీ నేత‌లు ఈ అంశంలో కోడెల‌పై, టీడీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

టీడీపీకి సైతం కోడెల వ్య‌వ‌హారం రోజురోజుకూ ప‌రువు న‌ష్టంగా మారింది. ఇంకా ఇటువంటివి ఎన్ని ఆరోప‌ణ‌లు వ‌స్తాయో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle