newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

మాకూ టిక్కెట్లు కావాలంటున్న కుల సంఘాలు

17-03-201917-03-2019 15:50:08 IST
Updated On 17-03-2019 15:50:00 ISTUpdated On 17-03-20192019-03-17T10:20:08.459Z17-03-2019 2019-03-17T10:18:09.723Z - 2019-03-17T10:20:00.959Z - 17-03-2019

మాకూ టిక్కెట్లు కావాలంటున్న కుల సంఘాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాలతో ముడిపడి ఉన్నాయనేది వాస్తవం. ఎన్నికల సమయంలో కులాలు, వారి బలాల ఆధారంగా టిక్కెట్ల కేటాయింపులు జరగడం కూడా సాధారణమే. అయితే రాష్ట్రంలోని కొన్ని కులాలు ఇప్పుడు తమకు కూడా ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా దూదేకుల కులం ఇప్పుడు టిక్కెట్ల కోసం పట్టుబడుతోంది. ఏపీలో 25 లక్షల మంది ఉన్న తమ కులం నుంచి ఇప్పటి దాకా ఒక్క వ్యక్తి కూడా చట్ట సభల్లో ప్రాధాన్యత కల్పించలేదని వాపోతున్నారు.

ఈ ఎన్నికల్లో 5 అసెంబ్లీ, ఒక లోక్ సభ టిక్కెట్ ఇవ్వాలని ప్రధాన పార్టీలను డిమాండ్ చేస్తున్నారు. వీరి బాటలోనే పద్మశాలీలు గళం విప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది పద్మశాలీలు ఉన్నారు. ముఖ్యంగా మంగళగిరి అసెంబ్లీ సీటులో 57 వేలకు పైగా వీరి ఓట్లు ఉన్నాయి. కానీ ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ బరిలో దిగారు.

జనసేన పార్టీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో మంగళగిరి నియోజకవర్గ సీటుతో పాటు, మరో నాలుగు అసెంబ్లీ టిక్కెట్లు తమ కులం వారికి కేటాయించాలని పట్టుబడుతున్నారు.

ఇక ఏపీలోని 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ ఓట్లు అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తాయని అంటున్నారు బ్రాహ్మణులు. ఈ ఎన్నికల్లో తమ కులానికి చెందిన వారికి 5 ఎంఎల్ఏ, 2 ఎంపీ టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో కులాల ప్రభావం మరింత తీవ్రం కానున్నట్లు అర్థం అవుతోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle