newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

'మహిళా సీఎం' ప్రచారంపై వైసీపీ మౌనమేంటి?

25-02-202025-02-2020 12:52:52 IST
2020-02-25T07:22:52.476Z25-02-2020 2020-02-25T07:22:49.535Z - - 07-04-2020

'మహిళా సీఎం' ప్రచారంపై వైసీపీ మౌనమేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది నెలలు పూర్తయింది. ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రతిపక్షాలు ఒక్క మాటంటే మంత్రుల దగ్గర నుండి ముక్కు మొహం తెలియని నేతలు కూడా ఒంటి కాలు మీద లేచి ప్రతిపక్ష నేతలను మాటలతోనే చీల్చి చెండాడేవారు. మాటలతో సమాధానం చెప్పలేని విమర్శలకు బూతులను జోడించి మరీ ఎదుటి వాళ్ళని నోరెత్తకుండా చేయడం కూడా చూశాం.

అంతలా విరుచుకుపడే నేతలు ఒక్క విషయంలో మాత్రం మౌనం పాటించడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది. గత ఐదు రోజుల క్రితం వైసీపీకి ఆర్ధిక బలం కలిగిన ముఖ్య నేతలలో ఒకరైన పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) ఒక సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిని చూడాలని ఉందన్నది ఆ ట్వీట్ సారాంశం.

ఆ ట్వీట్ ను కాసేపటికే అయన డిలీట్ చేసేశారు. కానీ అప్పటికే నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీసి రచ్చ రచ్చ చేసేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన ప్రతిపక్ష టీడీపీ నేతలైతే సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లడం తప్పదని ఆ పార్టీ నేతలకు కూడా తెలిసిపోయిందా? అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. అప్పటికే టీడీపీ నేతలు కేసుల విషయంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

వాళ్ళకి ఈ ట్వీట్ రూపంలో మరో ఆయుధం దొరికేసినట్లైంది. ఇప్పటికే వ్యాన్‌పిక్‌ ప్రాజెక్టుకి చెందిన అవినీతి కేసులలో వ్యాపారవేత్త నిమ్మగడ్డను అదుపులోకి తీసుకొని దేశం దాటి వెళ్లకుండా చేసిన ఇంటర్ పోల్ త్వరలోనే సీఎం జగన్ కోసం రానుందని టీడీపీ తీవ్రంగా ప్రచారం చేస్తుంది. దీనిపై ఒకపక్క అంతర్జాతీయ కోర్టుతోపాటు రస్‌ అల్‌ ఖైమా కోర్టులోనూ కేసు నడుస్తుంది.

మరోవైపు మన కేంద్ర ప్రభుత్వం కూడా అరబ్‌ ఎమిరేట్స్‌ కోర్టు తీర్పులను మన దేశంలో కూడా అమలు చేయడానికి అంగీకరిస్తూ ప్రత్యేక గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈక్రమంలో సీఎం జగన్ ఇంటర్ పోల్ చేతికి చిక్కితే రాష్ట్రానికి మాహిళా సీఎం అవుతారన్నది ప్రతిపక్షాల వ్యాఖ్యల అర్ధంగా కనిపిస్తుంది. అయితే, దీనిపై వైసీపీ నేతలు మౌనం వహించడం విశేషం.

టీడీపీ నేతలు బోండా ఉమా, దేవినేని ఉమా, గోరంట్ల బుచ్చయ్య వంటి నేతలైతే సోషల్ మీడియా, ప్రెస్ మీట్లు అన్న తేడా లేకుండా ఈ విషయంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతి విషయానికి పోటీలు పడుతూ తమ అధినేతపై మాట పడనీయని వైసీపీ నేతలు ఈ విషయంలో మాత్రం కాస్త వెనక్కు తగ్గుతున్నారు. దీంతో గత ఐదు రోజులుగా రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   6 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   10 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   10 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   12 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   15 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   16 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   16 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   16 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   18 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle