newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

మళ్ళీ బుక్కైన లోకేష్... నెటిజన్స్ సెటైర్స్

08-02-201908-02-2019 12:25:28 IST
2019-02-08T06:55:28.941Z08-02-2019 2019-02-08T06:55:24.299Z - - 27-05-2020

మళ్ళీ బుక్కైన లోకేష్... నెటిజన్స్ సెటైర్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మంత్రి నారా లోకేష్‌కు తప్పులు చేయడం కొత్తేమీ కాదు. ఉత్సాహంలో ఏదేదో మాట్లాడేసి, ఎన్నోసార్లు అభాసుపాలయ్యారు. తెలుగుదేశం పార్టీనే కులగజ్జి పార్టీగా అభివర్ణించడం, టిడిపికి ఓటేస్తే మనకు మనం ఉరేసుకున్నట్టేనని పబ్లిక్‌గా స్టేట్‌మెంట్ ఇవ్వడం, సార్వభౌమాధికారం పలకలేక ‘భౌ భౌ’మనడం... ఇలా ఎన్నో! అలాంటి లోకేష్ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. గతంలో జోష్‌లో చేసిన ఒక ట్వీట్ ఆయన్ను ఘోర అవమానాలపాలు చేసింది.

ఇంతకీ లోకేష్ ఆ ట్వీట్‌లో ఏం పేర్కొన్నారంటే... ‘‘అటు టిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండూ కలిసి 12 ఏళ్ళలో హైదరాబాద్‌లో మెట్రోరైలు కట్టలేకపోయారు. అది సుదూర కలగానే మిగిలిపోయింది. అధికారంలోకి వచ్చి 19 నెలలైన టీడీపీ మాత్రం 2018 డిసెంబర్ నాటికి విజయవాడలో మెట్రో పనులు పూర్తిచేసేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్... తెలివిగా ఆలోచించు’’! మూడేళ్ళ కిందట (2016 జనవరి 13) లోకేష్ చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ ప్రకారం ఈపాటికే విజయవాడలో మెట్రో పనులు పూర్తైపోవాలి. కానీ... అలా జరగకపోగా ఆ ప్రాజెక్టే రద్దైపోయింది. దీంతో నెటిజన్లు సెటైర్లు వేసుకుంటున్నారు.

ఈసారి విజయవాడ వెళ్తే కచ్ఛితంగా మెట్రో రైలు ఎక్కుతానంటూ ఒకరు జోకేస్తే... లోకేష్ అన్న నాకొక బాల్కనీ టికెట్ (మెట్రోలో) కావాలంటూ ఇంకొకరు సెటైర్ వేశారు. ‘‘ఇంతకీ ఈ మెట్రో రైలు రోడ్డుపై ఉందా, లేక కృష్ణానది కింద కట్టారా’’ అంటూ మరొకరు కౌంటర్ పేల్చారు. బహుశా లోకేష్ దృష్టిలో మెట్రో అంటే షూ కంపెనీ, క్యాష్ అండ్ క్యారీ సూపర్ మార్కెట్ అయ్యుంటుందని... రైలు ప్రాజెక్ట్ అయ్యుండకపోవచ్చని ఇంకొంతమంది జనం ఓ ఆటాడుకుంటున్నారు. ఇలా వందల సంఖ్యలో సెటైర్లు పడుతూనే ఉన్నాయి. నాన్నకు చెప్పకుండా ట్వీట్ పెడితే... దాని పర్యవసానం ఇలాగే ఉంటుందంటూ మరికొందరు అందుకున్నారు.

పనిలోపనిగా... గతంలో చంద్రబాబు చేసిన కొన్ని తప్పుల్ని కూడా వెలికి తీస్తున్నారు. ట్వీట్ల దగ్గర నుంచి మోదీని నెత్తికెక్కించుకున్న సందర్భాల వరకూ.... అన్నీ బయటికి తీసి బాబు, లోకేష్‌ల మీద జోకులు వేసుకుంటున్నారు. తెలుగు తమ్ముళ్ళు ఈ వ్యవహారాన్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నా... నెటిజన్లు ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా సెటైర్ల పరంపరని కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో... మరోసారి టిడిపి ఘోర అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   10 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   12 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   15 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   17 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   18 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   18 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   18 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   19 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   19 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   19 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle