newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

మల్లాది విష్ణుకి బ్రాహ్మణ కార్పొరేషన్ పగ్గాలు?

06-09-201906-09-2019 07:55:54 IST
2019-09-06T02:25:54.232Z06-09-2019 2019-09-06T02:22:51.246Z - - 15-11-2019

మల్లాది విష్ణుకి బ్రాహ్మణ కార్పొరేషన్ పగ్గాలు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100రోజులు కావస్తోంది. వివిధ నామినేటెడ్ పోస్టులకు ఆయన వైసీపీ నేతలను నియమిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. తాజాగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమించనున్నట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే సీఎం విష్ణు నియామకానికి నిర్ణయం తీసుకున్నారని రేపో మాపో ఉత్తర్వులు జారీ కావచ్చని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖరరెడ్డికి విశ్వాసపాత్రుడిగా పేరున్న విష్ణు గతంలో ఉడా ఛైర్మన్‌గా కూడా పనిచేయగా టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా అవకాశం కల్పించారు. 

జగన్ కేబినెట్లో మల్లాదికి కేబినెట్ బెర్త్ దక్కుతుందని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల అది దక్కకపోగా ఇప్పుడు కార్పొరేషన్ పదవిని అప్పగించనున్నట్లుగా తెలుప్తోంది.

అసంతృప్తులకు నామినేటెడ్ పదవులు తాయిలాలు వేస్తున్నారు జగన్. ఇప్పటికే రోజాకు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవి, వాసిరెడ్డి పద్మకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవి అప్పగించిన సంగతి తెలిసిందే. రెండుమూడు రోజుల్లో టీటీడీ బోర్డు సభ్యులను కూడా నియమించనున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle