newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

మల్లాది మెజారిటీపై పందేల జోరు

16-04-201916-04-2019 15:56:33 IST
Updated On 16-04-2019 18:18:45 ISTUpdated On 16-04-20192019-04-16T10:26:33.215Z16-04-2019 2019-04-16T10:25:40.046Z - 2019-04-16T12:48:45.564Z - 16-04-2019

మల్లాది మెజారిటీపై పందేల జోరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బెజ‌వాడ రాజ‌కీయాల్లో ఇప్పుడు మ‌ల్లాది విష్ణు హాట్ టాపిక్ అయ్యార‌ట‌. విజ‌య‌వాడ సెంట్రల్ సీటు నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయ‌న పోటీ చేశారు. దీంతో మ‌ల్లాదికి ఎంత మెజార్టీ వ‌స్తుంద‌న్న దాని మీద విజ‌య‌వాడ‌లో బెట్టింగులు జ‌రుగుతున్నాయిట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వ‌చ్చే మ‌ధ్యలో జ‌రిగిన ప‌రిణామాలే విష్ణు మీద అంచ‌నాలు అమాంతం పెంచేశాయి. విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న మ‌ల్లాది, టీడీపీలోకి వెళ్తున్నార‌న్న ప్రచారం గ‌తంలో జ‌రిగింది. 

చంద్రబాబు కూడా ఆయ‌న‌కు బంప‌ర్ ఆఫ‌ర్లు ఇస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ విష్ణు వేటికీ లొంగ‌లేదు. ఆ త‌ర్వాత ఆయ‌నకు చెందిన మ‌ద్యం షాపులో క‌ల్తీ మ‌ద్యం తాగి కొంత మంది ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అది మ‌ల్లాది విష్ణు మీద జ‌రిగిన కుట్రలో భాగ‌మేన‌ని ఇప్పటికీ కొంద‌రు విజ‌య‌వాడ వాసులు బ‌లంగా న‌మ్ముతున్నారు. 

No photo description available.

రాజకీయంగా తనకు ఎదురైన అన్ని ఆటంకాల‌ను ఎదిరించి చివ‌ర‌కు వైసీపీ నుంచి పోటీ చేశారు మ‌ల్లాది విష్ణు. సిట్టింగ్ ఎంఎల్ఏ బోండా ఉమా మీద ఆయ‌న పోటీ ప‌డ్డారు. ఈ సీటులో బ్రాహ్మణుల‌దే కీల‌క ఓటింగ్. త‌న సామాజిక వ‌ర్గం ఓటింగుతో పాటు ఇత‌ర కులాలు, రంగా అభిమానులు కూడా త‌న‌కు ఓటేశారని మ‌ల్లాది విష్ణు న‌మ్ముతున్నారు. అందుకే ఇప్పుడు ఆయ‌న మీద పందేలు కాస్తున్నారట‌ విజ‌య‌వాడ జ‌నం. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle