newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

మలుపులు తిరుగుతున్న గుంతకల్లు రాజకీయం

24-03-201924-03-2019 09:35:37 IST
2019-03-24T04:05:37.822Z24-03-2019 2019-03-24T03:37:22.777Z - - 22-07-2019

మలుపులు తిరుగుతున్న గుంతకల్లు రాజకీయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనంతపురం జిల్లా గుంతకల్లు రాజకీయం పలు మలుపులు తిరుగుతోంది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంఎల్ఏ జితేంద్రగౌడ్, వైసీపీ నుంచి వై.వెంకటరామిరెడ్డిల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. మొదటి నుంచీ టిక్కెట్ విషయంలో బాగా టెన్షన్ పడ్డారు టీడీపీ అభ్యర్థి జితేంద్రగౌడ్. చంద్రబాబు సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా రిపోర్ట్ రావడం, అటు జే.సీ. దివాకర్ రెడ్డి కూడా వ్యతిరేకించడం జితేంద్రకు మైనస్ పాయింట్లుగా మారాయి. 

ఈ పరిణామాలతో ఎదురు దాడి చేసిన జితేంద్ర గౌడ్, తనకు టిక్కెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని ప్రకటించారు. ఇదే సమయంలో అనంతపురం లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన నలుగురికి టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో బీసీలకు టిక్కెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు జితేంద్ర. ఈ ప్రచారంతో కంగుతిన్న చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో జితేంద్రగౌడ్‌కు టిక్కెట్ ఇచ్చారట. గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో వ్యవసాయదారీ కుటుంబాలే ఎక్కువ. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటించిన రైతురుణ మాఫీ, డ్వాక్రా రుణమాఫీ మీద జనం ఎంతో ఆశలు పెట్టుకున్నారట. 

కానీ ఆశించిన స్థాయిలో జరగకపోవడం టీడీపీకి మైనస్ పాయింట్ అయిందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎంఎల్ఏ జితేంద్రగౌడ్ మీద జనంలో తీవ్రంగా వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గుంతకల్లు అసెంబ్లీ పరిధిలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా బలంగానే ఉన్నాయి. అదే సామాజిక వర్గానికి చెందిన మధుసూదన్ గుప్తా టీడీపీ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. 

అంటే వైశ్యుల ఓట్లు కూడా టీడీపీకి దూరమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు... అనంతపురం ఎంపీగా పోటీ చేస్తున్న జే.సీ. పవన్ రెడ్డికీ, జితేంద్రకూ పొసగడం లేదు. ఇదే ఇప్పుడు టీడీపీలో సమస్యగా మారిందట. ఎందుకంటే జే.సీ, జితేంద్రగౌడ్ వర్గాల మధ్య భారీగా క్రాస్ ఓటింగ్ జరిగి వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతుందని జనం చెబుతున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మొదటి నుంచీ జనంలో తిరగడం ఆయనకు కల్సొచ్చే అంశంగా భావిస్తున్నారు. మొత్తానికి ఈసారి గుంతకల్లు ఎన్నికలు జనానికి మజా చూపిస్తున్నాయట.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle