newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

మరో రెండురోజుల పాటు భారీవర్షాలు

31-08-201931-08-2019 08:12:24 IST
Updated On 31-08-2019 08:12:08 ISTUpdated On 31-08-20192019-08-31T02:42:24.800Z31-08-2019 2019-08-31T02:41:20.475Z - 2019-08-31T02:42:08.663Z - 31-08-2019

మరో రెండురోజుల పాటు భారీవర్షాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్‌ రెండో తేదీన మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. శనివారం, ఆది, సోమవారాల్లో కోస్తా ఆంధ్రాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. 

కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడా తేలిక పాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.మరోవైపు పశ్చిమ బెంగల్,ఉత్తర ఒడిషాలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ప్రస్తుతం కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ నుంచి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొన్నారు. 

Image result for heavy rains in hyderabad

ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురిశాయి. ఇటు హైదరాబాద్ లో పలుచోట్ల శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం 11 గంటల నుంచే వాతావరణంలో మార్పులు సంభవించాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, ఎల్ నగర్, సికింద్రాబాద్, అల్వాల్, లింగంపల్లి, కూకట్ పల్లి, నాగోల్, చింతల్, రామంతాపూర్ ప్రాంతాల్లో వర్షం పడింది.

మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం చిన్నగా మొదలై.. సిటీ అంతటా దట్టమైన నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. సాయంత్రం వేళ భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.  వర్షంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. రద్దీ వేళ వర్షం పడటంతో.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవాళ్లు ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle