newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

‘‘మరో మూడు, నాలుగు పర్యాయాలు మీరే సీఎం’’

30-05-201930-05-2019 13:27:46 IST
Updated On 25-06-2019 15:35:55 ISTUpdated On 25-06-20192019-05-30T07:57:46.572Z30-05-2019 2019-05-30T07:57:44.702Z - 2019-06-25T10:05:55.601Z - 25-06-2019

‘‘మరో మూడు, నాలుగు పర్యాయాలు మీరే సీఎం’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్‌కు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం మిమ్మల్ని నడిపిస్తుందని జనం ఆశిస్తున్నారు. మీ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను. వయసు చిన్నది కానీ, బాధ్యత పెద్దది. బాధ్యతలను అద్భుతంగా నిర్వహించగలిగిన శక్తి, సామర్థ్యం ఉందని గత తొమ్మిదేళ్లలో మీరు నిరూపించారు. 

తండ్రి నుంచి వచ్చిన వారసత్వం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనం చేయాల్సింది ఖడ్గచాలనం కాదు కరచాలనం. ఇద్దరూ కలిసి నడిచి వెళ్ళాలి. గోదావరి జలాల సద్వినియోగం కావాలి. క‌ృష్ణానది జలాల వినియోగంలో సమస్యలు ఉన్నాయి. గోదావరి జలాల గురించి మాట్లాడారు. అండదండలు, సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఉభయ రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుతున్నానన్నారు.

ఒకటి కాదు రెండుకాదు ఏకంగా మూడునాలుగు పర్యాయాలు సీఎంగా కొనసాగాలన్నారు  కర్తవ్య నిర్వహణలో సహాయ సహకారాలు, అండదండలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. జగన్‌కు అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు అన్నారు కేసీఆర్.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle