newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

మరో పేచీ కానున్న అమరావతి స్టార్టప్‌ ఒప్పందం రద్దు?

06-11-201906-11-2019 07:50:18 IST
Updated On 06-11-2019 17:09:46 ISTUpdated On 06-11-20192019-11-06T02:20:18.445Z06-11-2019 2019-11-06T02:20:13.191Z - 2019-11-06T11:39:46.691Z - 06-11-2019

మరో పేచీ కానున్న అమరావతి స్టార్టప్‌ ఒప్పందం రద్దు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చాక రాజధాని అమరావతి అటకెక్కించేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్ల పనులకు టెండర్లు పిలవాలని ప్రణాళికలు సిద్ధం చేయగా.. ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. రాజధానిలో డెబ్భై శాతం పూర్తయిన శాశ్వత భవనాలను సైతం ఇప్పుడు నిర్మాణం ఆపేశారు. అసలు రాజధాని అమరావతిలోని ఉంటుందా అన్న ప్రశ్నకు కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో స్పష్టమైన సమాధానం చెప్పేవాళ్ళే లేరు.

ప్రస్తుతం రాజధానిపై ప్రభుత్వం నియమించిన పీటర్ కమిటీ అధ్యయనం చేస్తుందని మంత్రులు చెప్తుండగా ఆ కమిటీ ఇచ్చే నివేదిక మీదనే రాజధాని ఎక్కడ అన్నది ఆధారపడిఉందని తేల్చేశారు. ఇక గత ప్రభుత్వం అమరావతిలో స్టార్టప్‌ డెవలప్మెంట్ కోసం 2017 మే 17న విజయవాడలోని హోటల్‌ గేట్‌వే హోటల్ నందు సింగపూర్‌ కన్సార్టియంతో స్విస్‌ ఛాలెంజ్‌ పై ఒప్పందం చేసుకుంది. జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని మంత్రులే ప్రకటించారు.

జగన్ సర్కార్ స్టార్టప్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని ప్రకటించినా ఇది అంత సులభమైన విషయం కాదని.. దీనిపై ప్రభుత్వానికి మరో పేచీ తప్పదని తెలుస్తుంది. దీనికి కారణం తెలియాలంటే ఒకసారి ఈ అంశాన్ని నిశితంగా విశ్లేషించాల్సి వస్తుంది. స్విస్ ఛాలెంజ్ ఒప్పందం ప్రభుత్వం నేరుగా సింగపూర్ కన్సార్టియంతో కుదుర్చుకుంది. కనుక రద్దు కూడా ప్రభుత్వమే చేయాల్సి ఉండగా ఈ మేరకు మంత్రిమండలిలో తీర్మానం కూడా తప్పనిసరని నిపుణుల అభిప్రాయం.

మంత్రిమండలిలో స్టార్టప్‌ రద్దుపై తీర్మానం చేసి ప్రతిని సిఆర్డీఏకు పంపితే అక్కడి నుండి కన్సార్టియంకు పంపాల్సి ఉంది. సిఆర్డీఏ పంపిన తీర్మానాన్ని కన్సార్టియం పరిశీలించి తనకు అంగీకరమైతే నిర్ణయం ప్రతిని తిరిగి సిఆర్డీఏకు పంపాలి. అప్పుడే ఒప్పందం అధికారికంగా రద్దయినట్లు భావించాల్సి ఉంటుంది. కానీ కన్సార్టియం ఇక్కడ రద్దుకి అంత సులభంగా అంగీకరిస్తుందా? అన్నదే ప్రశ్నగా మారింది.

ఎందుకంటే ప్రాజెక్టు పూర్తయితే సింగపూర్ కన్సార్టియంకు రూ.3086 కోట్లు లాభం వస్తుందని గత ప్రభుత్వ సమయంలో సిఆర్డీఏ వెల్లడించింది. మరి అంత ఆదాయాన్ని కన్సార్టియం అంత సులభంగా వదులుకోవడం కష్టమే. కాగా మంత్రులు ఒప్పంద రద్దుకి పదికోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని ఓ సందర్భంగా చెప్పుకొచ్చారు. కానీ కన్సార్టియం మాత్రం తమకి దాదాపు ఎనభై కోట్ల వరకు రావాల్సి ఉందని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది త్వరలోనే పేచీగా మారనున్నట్లు తెలుస్తుంది.

ఈ ఒప్పందం మీద కానీ.. ఒప్పందం రద్దయితే ఇవ్వాల్సిన పరిహారం సంగతి కానీ.. కన్సార్టియం వద్ద ఈ విషయం మీద అధికారాల పరిస్థితి ఏంటి? అన్నది కూడా ప్రస్తుత ప్రభుత్వం వద్ద స్పష్టత లేదు. ఎందుకంటే ఆ ఒప్పందం సమయంలో అటు ప్రభుత్వంలో కానీ ఇటు సిఆర్డీఏలో కానీ ఉన్న అధికారులెవరూ ఈ ప్రభుత్వంలో లేరు. జగన్ సర్కార్ రాగానే భారీగా బదిలీలు చేయగా ఇప్పుడు ఆ ఒప్పందంలో క్లాజులు.. కన్సార్టియంకు ఉన్న అధికారులు తెలిసిన అధికారులు కరువయ్యారు.

కాగా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే పరస్పర అంగీకారం లాగానే నష్టపరిహారంలో కూడా తమకి ఇంత చెల్లించాలని డిమాండ్ చేసే అధికారం కూడా కన్సార్టియంకు కల్పించినట్లుగా తెలుస్తుందని.. ఆ ఒప్పందంతోనే సంస్థ అమరావతికి వచ్చిందని ఓ ముఖ్య అధికారి ఇచ్చిన సమాచారం. మరి దాదాపు రెండేళ్ల కాలాన్ని ఈ ప్రాజెక్ట్ మీద కేటాయించడంతో పాటు ఇప్పటివరకు జరిగిన పనులను బట్టి పరిహారం.. మూడువేల కోట్లకు పైగా ఆదాయాన్ని వదులుకోవాల్సి ఉండగా కన్సార్టియం రద్దుకి ఎంత డిమాండ్ చేస్తుందన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఏపీ సర్కారుకి మరో పేచీ తప్పదా?!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle