newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

మరేటి సేత్తాం.. వాకౌట్ చేత్తాం. బొత్స రూటే సపరేటు..!

22-07-201922-07-2019 14:58:05 IST
Updated On 23-07-2019 11:28:02 ISTUpdated On 23-07-20192019-07-22T09:28:05.451Z22-07-2019 2019-07-22T09:28:00.688Z - 2019-07-23T05:58:02.480Z - 23-07-2019

మరేటి సేత్తాం.. వాకౌట్ చేత్తాం. బొత్స రూటే సపరేటు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆయనో మాజీ మంత్రి. కానీ ఆయన రూటే సపరేటు. ఏదైనా ప్రశ్నడిగితే ఏటి సేత్తాం అంటారాయన. గతంలో ఓ కుంభకోణం విషయంలో ఆయన మాట్లాడిన మాటలవి. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. ఒక మంత్రిగా శాసనసభ, శాసనమండలిలో సభ్యులు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి వుంటుంది.

అయితే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వాకౌట్ చేశారు, ఈయన వాకౌట్‌తో అటు అధికార, ఇటు ప్రతిపక్ష సభ్యులు ఒకింత కంగుతిన్నారు. అధికార పార్టీకి చెందిన.. పైగా మంత్రి వాకౌట్ చేయడం ఏంటనే చర్చ జరుగుతోంది.

అయితే ఇప్పటి వరకూ అధికార పార్టీకి చెందిన సభ్యులుగానీ.. మంత్రులుగానీ వాకౌట్ చేసిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పాలి. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. కరువు, అనావృష్టిపై శాసనమండలిలో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు బొత్స స్పందించారు. కరువుపై అన్ని జిల్లాల నుంచి సమగ్ర నివేదికలను తెప్పిస్తున్నామని.. త్వరలోనే ఈ లెక్కలు తేలతాయని మంత్రి చెప్పారు.

అంతా బాగానే ఉంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదు అయిందన్నారు. ఆత్మహత్యలు ఎవరు చేసుకున్నారు..? ఎటువంటి పరిస్థితుల్లో చేసుకున్నారు..? అనే దానిపై నివేదిక తయారు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పనిలో పనిగా గడచిన ఐదుసంవత్సరాల్లో గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మంత్రి విమర్శలు గుప్పించారు. 

అయితే చర్చ జరుగుతున్న సమయంలోనే సభ నుంచి మంత్రి వెళ్ళిపోయారు. మరోవైపు.. ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి వెళ్లిపోవడంపై టీడీపీ శాసనమండలి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.  చర్చపై సరైన సమాధానం రాకపోవడం, మంత్రి బొత్స మండలి నుంచి వెళ్లిపోవడంతో టీడీపీ శాసనమండలి సభ్యులు కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు.

అయితే ఈ వాకౌట్ వ్యవహారంపై బొత్స రియాక్షన్ రావాల్సి ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తన సోదరుడు హఠాన్మరణం చెందడంతో ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాలేకపోతున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ బడ్జెట్ కూడా బొత్స ప్రవేశపెట్టారు. కీలకమయిన కరువు అంశంపై చర్చ జరుగుతుండగా.. మంత్రి వాకౌట్ చేయడంపై టీడీపీ సభ్యులు విమర్ళలు చేస్తున్నారు. అయితే అది వాకౌట్ కాదని, ఆయన వ్యక్తిగత పనుల కోసం వెళ్ళారని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది మాత్రం మంత్రి బొత్సనే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle