newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

04-04-202004-04-2020 14:05:52 IST
Updated On 04-04-2020 14:29:45 ISTUpdated On 04-04-20202020-04-04T08:35:52.270Z04-04-2020 2020-04-04T08:34:43.545Z - 2020-04-04T08:59:45.827Z - 04-04-2020

మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. తాజాగా రెండవ కరోనా మరణం సంభవించింది.హిందూపురానికి చెందిన56 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ తో మరణించినట్టు వైద్యులు తెలిపారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఇంతకుముందు విజయవాడకు చెందిన ఒక రోగి కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకూ ఏపీలో ఇద్దరు మరణించారు. ఒక్కరోజే 16 కేసులు నమోదయ్యాయి. నలుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కేసులు పెరగడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. 

ఇటు చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన క్వారంటైన్ సెంటర్లో కనీస వసతులు కరువయ్యాయని అంటున్నారు. తాము నరకాన్ని చూస్తున్నామని చీరాల ఇంజనీరింగ్‌ కాలేజీలోని క్వారంటైన్‌ లో ఉన్న ఇన్‌ పేషెంట్స్‌ బాధపడుతున్నారు.  కనీస మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లను కూడా ఇవ్వడంలేదని అధికారులపై మండిపడుతున్నారు. కనీసం టిఫిన్ కూడా సరిగా లేదంటున్నారు. టిఫిన్‌లో పురుగులుండటంతో టిఫిన్‌ను తినబోమని చెప్పేశారు పేషెంట్లు.  తమ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు.

చీరాల ఇంజనీరింగ్‌ కాలేజీలోని క్వారంటైన్‌ లో ఉన్న ఇన్‌ పేషెంట్లు మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చారా..! అంటూ... ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమకు నరకాన్ని చూపిస్తున్నారంటూ వారంతా ఆగ్రహానికి గురవుతున్నారు. కనీసం తమకు మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లను కూడా ఇవ్వడం లేదని. కావాల్సిన వారు బయటినుంచి కొనుక్కోమని ఉచిత సలహా ఇస్తున్నారని మీడియాకు తెలిపారు. వారంతా అక్కడి సౌకర్యాలపై కంటతడిపెట్టారు. శనివారం ఉదయం ఇన్‌ పేషెంట్‌ వార్డులో ఉన్నవారికి ఇచ్చిన టిఫిన్‌ లో పురుగులు ఉన్నాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

దీంతో తామంతా ఉపవాసం  ఉంటామని, ఇలాంటి టిఫిన్ తినబోమని ఇన్‌ పేషెంట్‌ లంతా  నిరసన తెలిపారు. తమ మధ్యలో ఎవరికైనా పాజిటివ్‌ ఉంటే తమందరి పరిస్థితి ఏమిటని వారు అధికారులను నిలదీస్తున్నారు. ఈ ఇంజనీరింగ్ కాలేజీలోని మొత్తం నాలుగు ఫ్లోర్‌ లలో ఫ్లోర్‌ కి 80 మంది చొప్పున 250 మంది పైనే ఇన్‌ పేషెంట్లు ఉన్నారు. రూమ్‌ కి నలుగురు ఉంటున్నారు. పేషెంట్లంతా తమ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతమందిని ఒకేచోట ఉంచడం కరోనా వ్యాపించడానికి ఆస్కారం ఇచ్చినట్టేనని వారంతా ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle