newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

మన సీఎంలది రాజకీయ స్నేహమేనా? ప్రజల కోసం కాదా..?!

13-05-202013-05-2020 16:11:44 IST
Updated On 13-05-2020 16:44:43 ISTUpdated On 13-05-20202020-05-13T10:41:44.688Z13-05-2020 2020-05-13T10:41:42.240Z - 2020-05-13T11:14:43.334Z - 13-05-2020

మన సీఎంలది రాజకీయ స్నేహమేనా? ప్రజల కోసం కాదా..?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఔను సీఎం జగన్ మాకు మిత్రుడేనని సీఎం కేసీఆర్ అవకాశం వచ్చిన ప్రతిసారి వెల్లడించగా.. జగన్ మాకు ఆప్తుడేనని షాడో సీఎంగా పేరున్న కేటీఆర్ కూడా పలుమార్లు ప్రకటించారు. ఇక అటు నుండి జగన్ కూడా అంతే. సాక్షాత్తు ఏపీ అసెంబ్లీలోనే సీఎం కేసీఆర్ ను ఆహా ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

అయితే.. ఈ స్నేహం రాజకీయాల కోసమేనా? ప్రజల కోసం కదా? అన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు మన ముఖ్యమంత్రులకు వేస్తున్న ప్రశ్న. కేవలం రాజకీయ అవసరాల కోసం.. ఎన్నికలలో ప్రత్యర్థులను ఓడించి తాము గద్దెనెక్కడానికి మాత్రమే రెండు రాష్ట్రాల అధికార పార్టీలు అవగాహనతో కలిసిపనిచేస్తారా? ప్రజలకు అవసరమైనపుడు మాత్రం వీరి స్నేహం పనికిరాదా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జలజగడం గురించి తెలిసిందే. శ్రీశైలం నుండి కృష్ణా నీటిని తోడి రాయలసీమకి పంపింగ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జీవో ఇచ్చిందని.. అది తెలంగాణకు నష్టం చేకూర్చే అంశమని సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించారు. అంతేకాదు దానిపై సమీక్ష కూడా జరిపి ఇక యుద్ధమేనని ప్రకటించారు. త్వరలోనే దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలని నిర్ణయించారు.

మరోపక్క ఏపీ ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్ర వాటా పరిధిలోనే తాము కొత్త పథకాన్ని నిర్మిస్తున్నామని చెప్తుంది. ఇంతకు ముందు ఒప్పందం చేసుకున్న ప్రకారం ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలన్నా ముందుగా అపెక్స్ కౌన్సిల్ ఆమోదంపొందాల్సి ఉంది. కానీ అనుమతి లేకుండానే కొత్త ప్రాజెక్ట్ ఎలా చేపడతారని తెలంగాణ ప్రశ్నిస్తుంది. మరోవైపు తగాదాలను తీర్చాల్సిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో చాలా జాప్యం జరుగుతుంది.

మొత్తంగా ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాల అంశంగా మారిపోతుంది. సహజంగానే సున్నితమైన అంశం కనుక రెండు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని హైలెట్ చేసేందుకు ముందుకు వస్తాయి. ఇప్పటికే తెలంగాణలో అటు బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం మొదలుపెట్టాయి. మంగళవారం ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ వీడియో కాన్ఫిరెన్స్ కూడా నిర్వహించింది.

సహజంగానే రెండు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండడంతో ఇలాంటి వాటిని జాతీయ పార్టీలు టేకప్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇది రాష్ట్రాల అంశం కనుక జాతీయ పార్టీలు ఏ రాష్ట్రానికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. కానీ ఇంత సామరస్యంగా ఉండే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశానికి వచ్చేసరికి ఎందుకు సుప్రీమ్ వరకు వెళ్లాల్సి వస్తుందన్నది ఆసక్తి కలిగిస్తుంది.

అసలు ఇద్దరు సన్నిహితులైన సీఎంల మధ్య ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పండుగలు, సంబరాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు కలిసి జరుపుకుంటున్న ఇద్దరు ముఖ్యమంత్రుల స్నేహం ప్రజల కోసం ఎందుకు ఉపయోగపడడం లేదు? పరస్పరం ఒప్పందాల ప్రకారం ఇకపై ముందుకు వెళ్తామని మీడియా ముఖంగా చెప్పిన ఊసులన్నీ తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసమేనా? ప్రజల కోసం కాదా?

సీఎం జగన్ ఉమ్మడి ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకొనే ముందు కేసీఆర్ ను సంప్రదించవచ్చు.. ఒకవేళ జగన్ అలాంటిది చేయకుండా జీవో విడుదల చేసినా సీఎం కేసీఆర్ ఈ పరిస్థితిపై జగన్ తో మాట్లాడే ప్రయత్నం చేయాల్సింది. పోనీ రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులైనా సమావేశమై సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఏది కాకపోతే రెండు రాష్ట్రాల మధ్య వారధులుగా పనిచేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్, విజయసాయి లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు కనుక వాళ్ళైనా కలిసి సమావేశం కావచ్చు.

కానీ ఏది లేకుండా కోర్టులను ఆశ్రయిస్తామని ప్రకటిస్తున్నారు. అయితే.. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు టేకప్ చేస్తే ఇది కాస్త రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. సహజంగానే మొన్నటి వరకు కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రం కనుక ఇప్పటికీ ఇంకా ఆనాటి పరిస్థితి మరుగున పడలేదు. ఈక్రమంలో ఇలాంటి సున్నితమైన అంశాలు ప్రజలలోకి వెళ్తే రాష్ట్రాల మధ్య అగాధం పెరుగుతుంది.

మరోవైపు సుప్రీమ్ కోర్టుకు వెళ్లాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ రాష్ట్రాల మధ్య నీటి తగాదాలపై సుప్రీమ్ తేల్చిన సందర్భాలు చాలా తక్కువ. కనుక ఇది ఇప్పట్లో తేలే అంశం కాదు కనుక అప్పటి వరకు ప్రజల మధ్య లోకల్ ఫీలింగ్స్ పెరుగుతూనే ఉంటాయి. పైగా రెండు రాష్ట్రాలు ప్రజల సొమ్మును లాయర్ల ఫీజులు.. అధికారులు ఢిల్లీకి రాష్ట్రాలకి రానుపోను ఖర్చు కోట్లలో చెల్లించాల్సి వస్తుంది.

అంటే ఇద్దరు సీఎంలు అనుకుంటే ఒక్కరోజులో తీరిపోయే సమస్యకు ప్రజలు మనోభావాలు.. సొమ్ములు ఖర్చుచేయాల్సి వస్తుంది. గత చంద్రబాబు-కేసీఆర్ ప్రభుత్వాల మాదిరి పరస్పర విభేదించే ప్రభుత్వాలైతే ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యేవి కాదు. కానీ ఇక్కడ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ, ఆప్యాయతలు కలిగిన ప్రభుత్వాలు కనుకే ప్రజల తరపున అడగాల్సి వస్తుంది. అయితే.. ఆ ప్రేమలన్నీ వారి రాజకీయాల కోసమే అంటే మాత్రం మనం అడగాల్సింది.. వాళ్ళు చెప్పాల్సింది ఏమీ ఉండదు!

 

 

 

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో  కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

   7 minutes ago


ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

   4 hours ago


60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

   4 hours ago


ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   6 hours ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   8 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   8 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   8 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   9 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   9 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle