newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

మనోడే కదా.....ఇచ్చెయ్యండి!

16-03-201916-03-2019 07:39:12 IST
Updated On 16-03-2019 12:39:28 ISTUpdated On 16-03-20192019-03-16T02:09:12.993Z16-03-2019 2019-03-16T02:09:07.345Z - 2019-03-16T07:09:28.281Z - 16-03-2019

మనోడే కదా.....ఇచ్చెయ్యండి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వడ్డించే వాడు మనోడైతే చాలు, పార్టీకి రాకపోయినా అందాల్సింది అందుతుంది. ఇదే సూత్రం ఏపీ ప్రభుత్వం పాటించినట్లుగా భావించాల్సి వస్తోంది. ఎందుకంటే బాలకృష్ణ రెండో అల్లుడు ఎంవీవీఎస్ భరత్‌కు ప్రభుత్వ భూమిని కారుచౌకగా అప్పగించింది ఏపీ ప్రభుత్వం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని జయంతీపురం గ్రామానికి చెందిన 498 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా ఏపీ ప్రభుత్వం కట్టబెట్టింది.

వందల కోట్లు విలువ చేసే ఈ భూమిని  కేవలం 4 కోట్ల రూపాయలకే భరత్‌కు చెందిన వీబీఎఫ్ ఫార్మా కంపెనీకి ఇస్తున్నట్లు 2015 జులై 15వ తేదీన జీవో నెంబర్ 269ని జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అప్పట్లో అక్కడ ఎకరం దాదాపు 50 లక్షలకు పైమాటే. అంటే దాదాపు 250 కోట్ల రూపాయల భూమిని కేవలం 4 కోట్ల రూపాయలకే ఇచ్చేసినట్లు అర్థం అవుతోంది.

ఆ తర్వాత 2015 సెప్టెంబర్ 22వ తేదీన మరో జీవో జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. జీవో నెంబర్ 27 పేరుతో ఎంవీవీఎస్ భరత్ కొన్న భూమి ప్రాంతాన్ని సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చింది. ఇప్పుడు అక్కడ ఎకరం దాదాపు రెండు కోట్ల రూపాయల దాకా ఉంది. అంటే భరత్‌కు దాదాపు వెయ్యికోట్ల రూపాయల లాభం కలిగించింది ఏపీ ప్రభుత్వం.

మరో విషయం ఏంటంటే 2014లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జీవో 165 జారీ చేశారు. ఆ జీవో ప్రకారం విశాఖ రుషికొండలోని 35 ఎకరాలు, ఎండాడ సమీపంలోని సర్వే నెంబర్ 35, 37, 38 పరిధిలోని భూముల్లో ప్రభుత్వ పరమైన నిర్మాణాలు చేపట్టాలి. అంటే ప్రభుత్వ కార్యాలయాలు, ఎస్సీ హాస్టల్, శిక్షణా కేంద్రాలు, ఆదాయపు పన్ను శాఖ భవనం, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్శిటీ తదితర నిర్మాణాల కోసం ఈ భూమిని కేటాయించారు.

అయితే ఈ భూములు మొత్తం ఎంవీవీఎస్ భరత్‌కు చెందిన గీతం యూనివర్శిటీ పరిసరాల్లో ఉన్నాయట. ఆ భూముల్లో కాలేజీ భవనాలు కట్టడానికి భరత్ ప్లాన్ చేశారట. ఈ విషయం తెల్సుకున్న చంద్రబాబు, 2014లో కిరణ్ కుమార్ రెడ్డి జారీ చేసిన జీవో నెంబర్ 165ను రద్దు చేస్తూ, 2015 మే 15వ తేదీన జీవో నెంబర్ 65ను జారీ చేశారు. అంటే ఆ భూమి మొత్తం భరత్ వశం అయ్యేలా అవకాశం ఇచ్చారు. ఇదంతా చంద్రబాబే కావాలని చేశారా, తన చిన్న అల్లుడికి బాలకృష్ణ గిఫ్ట్ రూపంలో ఇప్పించారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle