newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

మద్యపాన నేరాల్లో తెలంగాణ, ఆంధ్రా రెండూ దొందూ దొందే..

04-12-201904-12-2019 11:28:29 IST
2019-12-04T05:58:29.966Z04-12-2019 2019-12-04T05:58:22.464Z - - 09-12-2019

మద్యపాన నేరాల్లో తెలంగాణ, ఆంధ్రా రెండూ దొందూ దొందే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మద్యపానం ప్రాతిపదికన జరుగుతున్న ఘోర నేరాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయా? మొన్న తెలంగాణలో 'దిశ'పై హత్యాచార ఘటనను జాతి ఇంకా మరవలేదు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల సామాజిక ఆరోగ్య పరిస్థితిని ప్రశ్నార్థకం చేస్తోంది. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం జి.వేమవరంలో మద్యం మత్తులో ఓ మహిళపై హత్యాచారం చేసిన ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 

తెలంగాణలో ‘దిశ’ హత్యాచారం మరువకముందే ఆంధ్రాలో మరింత ఘోరంగా 60 ఏళ్ల వృద్ధ ఒంటరి మహిళను అత్యాచారం చేసి మరీ చంపేశాడో ముష్కరుడు.  జి.వేమవరం గ్రామం చాకలిపేట చెరువుగట్టుకు చెందిన కేశనకుర్తి నాగమణి(60)పై సోమవారం రాత్రి ఆమె ఇంటికి సమీపంలో ఉంటున్న దూరపు బంధువు కేశనకుర్తి నాగబాబు ఈ హత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు.

ఇంటి పక్కనే ఉంటున్న ఓ వృద్ధురాలు మంగళవారం నాగమణిని పిలవగా.. ఆమె పలకలేదు. దీంతో తలుపు తట్టడంతో నాగమణి హత్యకు గురైనట్టు గుర్తించి స్థానికులకు చెప్పడంతో, వారు ఎస్సై ఎస్‌.రాముకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆయన నాగమణి హత్యకు గురైనట్టు గుర్తించి జిల్లా ఎస్పీకి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 

నేరవిచారణలో భాగంగా క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగాయి. క్లూస్‌ టీం హత్య జరిగిన గదిలో కారం జల్లి ఉండడం, మృతురాలి ఒంటిపై రక్తం ఉండడంతో పోలీసులు ఈ హత్య నగదు కోసమా, లైంగికదాడి జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. డాగ్‌ స్క్వాడ్‌ ఇంటి ఆవరణ నుంచి రెండు ఇళ్ల అవతల ఉన్న నాగబాబు ఇంటికి వెళ్లి తిరిగి మృతురాలి ఇంటికి చేరుకొంది. దీంతో పోలీసులు నాగబాబు ఇంటి దగ్గర కుటుంబ సభ్యులను, పక్కన ఉన్న వారిని విచారించారు. మృతురాలి ఒంటిపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో ఈ హత్య ఎలా జరిగిందనేది పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. 

నాగమణి భర్త, కుమారుడు గతంలో చనిపోయారు. ప్రభుత్వం అందిస్తున్న ఫింఛనుతో ఆమె జీవనం సాగిస్తోంది. కూతురు హైదరాబాద్, కోడలు, మనుమలు భీమనపల్లిలో ఉంటున్నారు. నాగబాబు కుటుంబానికి నాగమణి కుటుంబానికి కుటుంబ గొడవలు ఉన్నట్టు సమాచారం. నాగబాబుకు వివాహమైనా భార్యతో గొడవపడడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్య లేక పోవడంతో వ్యసనాలకు బానిసైన నాగబాబు సోమవారం రాత్రి మద్యం సేవించి నాగమణి ఇంటిలోకి వెళ్లాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడి హతమార్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వయస్సుతో సంబంధం లేకుండా విచక్షణా రహితంగా మహిళపై దాడి చేయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఈ ఘటనతో మండల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గ్రామంలో ఉన్న నాగబాబుకు గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కేసులో తొలుత ముగ్గురు వ్యక్తులు మహిళను గ్యాంగ్‌ రేప్‌ చేసి ఉండవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. దీంతో నాగబాబుతో పాటు, గ్రామానికి చెందిన వర్రే బాబి, డేగల రాములను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.

కేశనకుర్తి నాగమణి(60) హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితులను పట్టుకున్నామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ చెప్పిన ఆరు గంటల్లోనే హత్య చేసిన నిందితుడిని పట్టుకున్నామన్నారు. మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా గ్రామానికి చెందిన నల్లా సుదర్శన్‌ ఇచ్చిన కీలక సమాచారంతో నిందితుడిని గుర్తించి కేసును కొలిక్కి తీసుకొచ్చారు.

ఇంటిలో ఒంటరిగా ఉంటున్న మహిళపై హత్యాచారం చేయడమే కాకుండా కేసును పక్కదోవ పట్టించేందుకు నాగబాబు కారంను ఉపయోగించాడు. గతంలో నాగబాబు అతడి భార్య తరచూ గొడవలు పడడంతో గత ఏడాది సామర్లకోటలో 498 కేసు, అలాగే కాకినాడ సర్పవరంలో దొంగతనం కేసు నమోదయ్యాయి. దీంతో జైలు జీవితం అనుభవించిన నాగబాబు తోటి ఖైదీలు కారం చల్లితే కేసు తప్పుదోవ పట్టించవచ్చని తెలపడంతో కారం చల్లినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 

దిశ హత్యాచార కేసును గంటల వ్యవధిలో ఛేదించామని తెలంగాణ పోలీసులు ప్రకటించగా, నాగమణి హత్యాచార కేసును ఆరు గంటల్లో ఛేదించామని ఆంద్రా పోలీసులు ప్రకటించడం బాగానే ఉంది కానీ తెలుగు రాష్ట్రాల సామాజిక, సాంస్కృతిక సంస్కారాన్ని బాగు చేసేవదెవరు అనే ప్రశ్న పరిష్కారానికి నోచుకోవడం లేదు. మద్యం తాగిన మత్తులో ఏం చేస్తున్నామో తెలీలేదని దిశ హంతకులు చెబితే, భార్య లేకపోవడంతో మద్యబానిస అయిన నాగబాబు పొరుగున్న ఉన్న నాగమణి ఇంటిలో దూరి లైంగికదాడి చేసి హతమార్చినట్లు పోలీసులు తెలుపుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి బరిగొడ్లను అరికట్టే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నది ప్రజాభిప్రాయం. ఘోరాలు జరిగాక ఛేదన విషయంలో రికార్డులు నెలకొల్పటం కంటే నేరాలు జరగిన విధంగా సామాజిక జీవితంలో మార్పులు తీసుకురావడం చాలా ఆవసరం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle