newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

మద్యపాన నిషేధం.. మేనిఫెస్టో అమలు.. గవర్నర్ ప్రసంగం హైలైట్స్

14-06-201914-06-2019 12:09:09 IST
Updated On 22-06-2019 15:59:42 ISTUpdated On 22-06-20192019-06-14T06:39:09.939Z14-06-2019 2019-06-14T06:39:06.574Z - 2019-06-22T10:29:42.862Z - 22-06-2019

మద్యపాన నిషేధం.. మేనిఫెస్టో అమలు.. గవర్నర్ ప్రసంగం హైలైట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అసెంబ్లీ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ కొత్త ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. మేనిఫెస్టో అమలు ప్రణాళికను గవర్నర్ ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వం చేర్చింది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామన్నారు. పాలనా సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు. పాలనలో మార్పులు తీసుకొస్తామన్నారు. ప్రత్యేక హోదాతో పాటు.. పోలవరం పూర్తి చేసేందుకు నిధుల్ని కేంద్రం నుంచి కోరుతుతున్నామన్నారు, డెండర్లలో పారదర్శకత కోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందాలనేది తమ ప్రభుత్వ ద్యేయం అన్నారు గవర్నర్. రాజన్నరాజ్యం తెస్తామంటున్న జగన్ .. ఈ ప్రసంగం ద్వారా ఆ దిశగా అడుగులు వేస్తామని చెప్పకనే చెప్పారు. 

 

గవర్నర్ ఏం చెప్పారంటే...

* బడుగువర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

* గ్రామ సచివాలయాల ఏర్పాటు 

* గ్రామ వాలంటీర్ల ద్వారా రేషన్ డోర్ డెలివరీ

* రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి ఇచ్చాం. 

* ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నాం.

* పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం. 

* రైతులకు వడ్డీలేని రుణాలు అందిస్తాం. 

* అవినీతి రూపుమాపేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం.

* కిడ్నీ బాధితులకు రూ.10500 పెన్షన్ 

* రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.12500 

* రాష్ట్ర విభజన సమస్యలపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి పెట్టింది. 

* రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న ప్రతీకుటుంబానికి ఆరోగ్యశ్రీ. 

* నవరత్నాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

* వ్యవసాయానికి నిరంతరంగా 9 గంటలు విద్యుత్.

* రైతు సమస్యలపై రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం.

* రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం

* రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది.

* ఆశావర్కర్లకు రూ.10వేల వేతనం 

* నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్

* దశలవారీగా పెన్షన్లను రూ.3000కు పెంచుతాం. 

* కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం 

* వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అక్టోబర్ 1 నుంచి అమలు 

* కాపులకు ఐదేళ్లలో పదివేల కోట్లు. 

* వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణాలు.

* దశలవారీగా మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నాం.

* ఇప్పటికే బెల్టు షాపులు రద్దు చేశాం.

* ఆరోగ్య సంరక్షణ సేవ కింద రూ.1000

* ప్రతీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. 

* ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ తగ్గిస్తాం.

* బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనకే అమ్మ ఒడి పథకం

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   9 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   10 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   11 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   13 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   15 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   15 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   15 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   15 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   15 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle