newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

మద్యం అమ్మకాలు తగ్గినా ఆదాయం తగ్గలేదు..

03-11-201903-11-2019 10:10:23 IST
2019-11-03T04:40:23.730Z03-11-2019 2019-11-03T04:39:51.645Z - - 20-11-2019

మద్యం అమ్మకాలు తగ్గినా ఆదాయం తగ్గలేదు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మొదలెట్టిన మద్యనిషేధం ఫలితాలను ఇస్తోందా అనే ప్రశ్నకు సమాధానం అవుననే గణాంకాలు తెలుపుతున్నాయి.  గత నెలరోజులుగా రాష్ట్రంలో మద్యవిక్రయాలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేయడం, ప్రభుత్వమే మద్య విక్రయాన్ని మొదలుపెట్టి షాపుల సమయాన్ని నియంత్రించడంతో మద్యపాన అలవాటు బాగా తగ్గుముఖం పట్టినట్లు నెలవారీ గణాంకాలు చెబుతున్నాయి. మద్యపాన నిషేధం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మరో వైపు మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. 

మద్య నియంత్రణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ అక్టోబరు నెలలో గణనీయంగా మద్యం విక్రయాలు, వినియోగం తగ్గుముఖం పట్టాయి. అంతేకాక ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుండటంతో నిర్ణీత సమయానికే వాటిని మూసివేస్తున్నారు. పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేయడంతో గతానికి భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. 

ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అందించిన తాజా వివరాలు ఇలా ఉన్నాయి. 2018 అక్టోబరులో 32,28,366 కేసులు (కేసు అంటే 12 బాటిల్స్) లిక్కర్‌ను విక్రయించగా, 2019 అక్టోబరులో మాత్రం 23,60,089 కేసులు మాత్రమే అమ్మారు. గతేడాది అక్టోబరు నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబరు నెలలో మద్యం విక్రయాలు 27 శాతం తగ్గాయి. అదే బీరు అమ్మకాలు చూసుకుంటే  2018 అక్టోబరులో 23,86,397 కేసులు అమ్ముడు కాగా, ఈ ఏడాది అక్టోబరులో 10,40,539 కేసులు మాత్రమే విక్రయించారు. 

గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే 56.4 శాతం తక్కువగా బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది కొత్త ప్రభుత్వం వచిన తర్వాత రాష్టంలో ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను 4380 నుంచి 3500కు తగ్గించడమే కాకుండా, మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టడంతో విక్రయాలు బాగా తగ్గాయి. మద్యం అమ్మకాలను ఉదయం 11 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకూ పరిమితం చేయడం అమ్మకాలు తగ్గడానికి మరో కారణం.

మరోవైపు గ్రామాల్లో కూడా బెల్టుషాపులు కనుమరుగయ్యాయి. బెల్టుషాపుల ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం ఉన్న ప్రదేశాలపై నిఘాను పటిష్టం చేశారు. మద్యం అమ్మకాలు గ్రామాల్లో జరగనీయవద్దంటూ పోలీసులు నేరుగా ఆయా గ్రామంలోని పెద్దలకు ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మరో వైపు మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మద్య నియంత్రణ, నిషేధం దిశగా వేస్తున్న అడుగుల్లో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటులో భాగంగా మహిళా పోలీసులను నియమించడం ద్వారా మద్య నియంత్రణ, నిషేధం దిశగా తీసుకుంటున్న చర్యల అమలుపై ప్రభుత్వం తన సంకల్పాన్ని గట్టిగా చాటింది.

అయితే లిక్కర్ అమ్మకాల ఆదాయం పడిపోయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే మరీ అంత వ్యత్యాసం కనిపించడం లేదు. 2018 అక్టోబర్‌లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ అమ్మకాల ద్వారా 1702 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తే, ఈ సంవత్సరం ప్రభుత్వానికి ఇదే నెలలో 1624 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. వ్యత్యాసం 78 కోట్లు మాత్రమే. కొత్త మద్యవిధానం అమలు చేసేముందు ప్రభుత్వం లిక్కర్ ధరలు బాగా పెంచడమే దీనికి కారణం. పైగా బ్లాక్ మార్కెట్‌ను పూర్తిగా నిరోధించడం కూడా మద్య ఆదాయం పెరుగుదలకు కారణం అని అధికారులు చెబుతున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle