newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

మద్యంపై ఉన్న మమకారం రైతులపై ఎక్కడ?

12-12-201912-12-2019 18:49:39 IST
Updated On 13-12-2019 12:34:40 ISTUpdated On 13-12-20192019-12-12T13:19:39.010Z12-12-2019 2019-12-12T13:19:37.637Z - 2019-12-13T07:04:40.291Z - 13-12-2019

మద్యంపై ఉన్న మమకారం రైతులపై ఎక్కడ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తినేగింజలకు కులం లేదు.. మరి రైతులకు కులం ఎందుకన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. వైసీపీ నేతలకు రైతుల కడుపుకోత కనబడడం లేదా అని రైతులు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల కోసం పుట్టింది జనసేన. పదవుల కోసం కాదు. రైతుకు పట్టం కట్టేందుకు జనసేన ఉంది..పంటను పండించే రైతును ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు పవన్ కళ్యాణ్ చెప్పారు. 

కాకినాడలో 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం రైతు సౌభాగ్య దీక్ష చేశారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. రైతుల కష్టాలు తనకు తెలుసని, ఒక చిన్న మడిలో వ్యవసాయం  చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుల కన్నీళ్లు ఆగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం వరకు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండదని తాను భావించానని, కానీ కొన్ని నెలల్లోనే రోడ్లపై రావాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. సూట్ కేసు కంపెనీలు తాను పెట్టలేదని, కాంట్రాక్టులు చేయడంలేదన్నారు. తాను సినిమాలు మాత్రమే చేశానన్నారు పవన్. అధికారం కోసం తాను ఆలోచించలేదని, అందుకే ఓడిపోయినా మీ ముందుకి వస్తున్నానన్నారు.

మద్యం ద్వారా వచ్చే ఆదాయం గురించే శ్రద్ధ పెడుతోందని, రైతుల గురించి ఆలోచించడంలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక లిక్కర్ అమ్ముకునేందుకు కార్డులు తెస్తామని అంటోందని ఓ రైతు పవన్ కి చెప్పారు. దీనిపై స్పందించిన పవన్.. మద్యపాన నిషేధం సంగతి ఏంటన్నారు. ఉదయం 10 గంటలు అయ్యేసరికి మద్యం దుకాణాల ఎదుట క్యూ కడుతున్నారని ఆ యువరైతు బదులిచ్చారు. బ్లాక్ మార్కెట్ ద్వారా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయన్నారు.

ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి గానీ,ఇబ్బందిపెడితే ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదన్నారు. పెరిగిన ఖర్చుల రీత్యా ధాన్యం క్వింటాల్ రూ.2200 నుంచి రూ.2400 ఉండాలని, అప్పుడే గిట్టుబాటు అవుతుందని పవన్ కళ్యాణ్ కి రైతులు వివరించారు.  రైతు సౌభాగ్య దీక్ష అంటూ రైతుల గురించి ఆలోచించిన పవన్ కళ్యాణ్ ని పలువురు రైతులు అభినందించారు. రైతుసౌభాగ్య దీక్షకు తరలివచ్చిన రైతులకు ప్రభుత్వం ఇబ్బందిపెడితే తనకు చెప్పాలని తానే వచ్చి ధాన్యం కొనుగోలుచేసేలా అధికారులపై వత్తిడి తెస్తానన్నారు. 

 

తెలుగు రాష్ట్రాల్లో టెస్టుల హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల పరీక్షలు

తెలుగు రాష్ట్రాల్లో టెస్టుల హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల పరీక్షలు

   2 hours ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   3 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   4 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   5 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   5 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   5 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   6 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   18 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   a day ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle