newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

మత్స్యకారులకు జగన్ భరోసా.. మరో హామీ నెరవేర్చిన సీఎం

21-11-201921-11-2019 15:39:00 IST
Updated On 21-11-2019 16:59:56 ISTUpdated On 21-11-20192019-11-21T10:09:00.427Z21-11-2019 2019-11-21T10:07:03.121Z - 2019-11-21T11:29:56.229Z - 21-11-2019

మత్స్యకారులకు జగన్ భరోసా.. మరో హామీ నెరవేర్చిన సీఎం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ ప్రజాసంకల్పయాత్రలో జనానికి భరోసా ఇచ్చిన ఏపీ సీఎం జగన్. పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన హామీ నెరవేర్చారు. వైయస్సార్‌ మత్స్యకార భరోసా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రారంభించారు.

Image

దీంతో మత్స్యకారులకు ఇచ్చిన హామీని తు.చ తప్పకుండా అమలు చేసినట్టయింది. సముద్రంలో వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి నానా ఇబ్బంది పడేవి. వీరిని ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేది. దీనిని ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది.

మత్స్య దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వేటనిషేధ పరిహారం రూ.10,000,డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. పథకంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి పొందుతారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. గంగపుత్రులకు ఇచ్చిన వాగ్ధానానికి కట్టుబడి ఉన్నాను. వేట నిషేధ సమయంలో ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి రూ. 10 సాయంగా అందిస్తున్నాం. అది నేటి నుంచే శ్రీకారం చుడుతున్నాం. మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో తిరిగి ఇంటికి వస్తారన్న భరోసా కూడా లేదు. 

సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.  ప్రభుత్వ ఏర్పడిన ఐదు నెలలు తిరగకముందే ఆ నాడు నేను ఇచ్చిన హామీని ఇదే వేదికపై నుంచి నెరవేరుస్తున్నాను. ఎవరెన్ని విమర్శలు చేసినా ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు సాగుతున్నానన్నారు సీఎం జగన్.  ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టబోతున్నాం.

పిల్లలంతా ఉన్నత చదువులు చదవాలి. అలాగే పేదలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఆస్పత్రులను కూడా మెరుగుపరుస్తున్నాం. పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్న మన ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎంతమంది శత్రువులు నాపై కుట్ర పన్నినా.. వారందరినీ ఎదుర్కొనే శక్తి నాకుందన్నారు జగన్. వృద్ధ గౌతమి గోదావరిపై ఐ.పోలవరం మండలం పశువుల్లంక – సలాదివారిపాలెం మధ్య రూ.35 కోట్లతో నిర్మించిన వైఎస్సార్‌ వారధిని సీఎం జగన్‌ ప్రారంభించారు. వారధి వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ వివిగ్రహాన్ని ఆవిష్కరించారు.

అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే మత్స్యకారుల సమస్యలను సీఎం జగన్‌ పరిష్కరిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మనసున్న వ్యక్తిగా ప్రతి వర్గంలోనూ సీఎం జగన్‌ ప్రతిష్ట పెరుగుతూనే ఉందన్నారు. ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే అరుదైన ఘటన అని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అభివర్ణించారు. కచ్చులురు వద్ద ప్రమాదానికి గురైన బోటును వెలిసి తీసిన ధర్మాడి సత్యం, బృందాన్ని సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. బోటు వెలికి తీసినందుకు సీఎం వారిని అభినందించారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle