newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

మందడంలో రైతుల దీక్ష.. జగన్ మూర్ఖుడంటూ బాబు విమర్శలు

16-01-202016-01-2020 09:36:50 IST
2020-01-16T04:06:50.173Z16-01-2020 2020-01-16T04:06:30.578Z - - 05-08-2020

 మందడంలో రైతుల దీక్ష.. జగన్ మూర్ఖుడంటూ బాబు విమర్శలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంక్రాంతి పండుగ అమరావతి రాజధాని ప్రాంతాల రైతులకు దూరమయింది. మందడంలో రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడు మందడంలో దీక్షలకు చంద్రబాబు కుటుంబసభ్యులతో హాజరై సంఘీభావం తెలిపారు.

ఈసందర్భంగా సీఎం జగన్ మూర్ఖుడంటూ ఘాటు విమర్శలు చేశారు చంద్రబాబు. ఇలాంటి సీఎంని తాను ఎక్కడా చూడలేదన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సూచనలకు అనుగుణంగానే తాను అమరావతిని రాజధాని ప్రాంతంగా ఎంపికచేశానన్నారు. 

తాను బాగుండాలి.. ఇతరులు ఏమైనా ఫర్వాలేదనే మూర్ఖత్వంలో జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాజధాని రైతుల ఆందోళనలు ఇవాళ 30వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులలో రైతుల మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నేడు రాజధాని గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటిస్తారు. ఇటు రైతుల ఆందోళన కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొననున్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle