newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

మందడంలో పోలీసుల ఆంక్షలు... గ్రామస్తుల ఆందోళన

31-12-201931-12-2019 13:45:01 IST
2019-12-31T08:15:01.307Z31-12-2019 2019-12-31T08:14:01.598Z - - 19-01-2020

మందడంలో పోలీసుల ఆంక్షలు... గ్రామస్తుల ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజధాని అమరావతి ప్రాంతంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి సచివాలయానికి వస్తున్నారని ఉదయం నుంచి పోలీసులు భారీగా మోహరించారు. మందడం మెయిన్ సెంటర్‌తో పాటు గల్లీల్లో ఉన్న షాపులను సైతం మూయించడంతో పోలీసులు-షాపు యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. దీంతో మందడం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

మందడంలో ధర్నాలు, నిరసనలకు అనుమతి నిరాకరించారు పోలీసులు. మరోవైపు ధనుర్మాసం సందర్భంగా మందడంలో శ్రీ వేణుగోపాలస్వామి ఊరేగింపు నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కోసం దేవుడి ఊరేగింపును పోలీసులు నిలిపివేశారు. జగన్ కాన్వాయ్ వెళ్లే వరకు ఆపేశారు. ముఖ్యమంత్రి కోసం దేవుడి ఊరేగింపును నిలిపివేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. 

ముఖ్యమంత్రి కాన్వాయ్ రావడంతో సుమారు 30 నిముషాలపాటు శ్రీ వేణుగోపాలస్వామి ఊరేగింపును పోలీసులు నిలిపివేయడం తమ సంప్రదాయాలను అవమానించడమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Image

ఐదు నిముషాల్లో కాన్వాయ్ వస్తుందంటే నిలిపినా ఫర్వాలేదని, కానీ కాన్వాయ్ రాకుండానే అరగంటపాటు నిలిపివేయడం ఏంటని గ్రామస్తులు భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు. అమరావతి రాజధాని గ్రామాల పట్ల సీఎం జగన్, మంత్రులు వ్యవహరిస్తున్న తీరుని మందడం గ్రామస్తులు తీవ్రస్థాయిలో విమర్శించారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle