newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

మంత్రుల ప‌ట్ల జ‌గ‌న్ నారాజ్‌..!

31-10-201931-10-2019 07:43:21 IST
Updated On 31-10-2019 15:13:42 ISTUpdated On 31-10-20192019-10-31T02:13:21.122Z31-10-2019 2019-10-31T02:08:44.627Z - 2019-10-31T09:43:42.133Z - 31-10-2019

మంత్రుల ప‌ట్ల జ‌గ‌న్ నారాజ్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని త‌న డ్రీమ్ క్యాబినెట్ నారాజ్ చేస్తోంది. 151 మంది ఎమ్మెల్యేల్లో ఏరికోరి 25 మందిని క్యాబినెట్‌లోకి తీసుకున్న జ‌గ‌న్, ఇప్పుడు వారి ప‌నితీరు ప‌ట్ల అంత‌గా సంతృప్తితో లేరు. వారి శాఖ‌ల‌కు సంబంధించి ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగ‌తా మంత్రుల ప‌నితీరు ప‌ట్ల జ‌గ‌న్‌కు సంతృప్తి ఉన్నా రాజ‌కీయంగా మంత్రులు అంత‌గా చురుగ్గా లేర‌ని భావిస్తున్నారు.

చంద్ర‌బాబు నాయుడు అధికారంలో ఉన్న‌ప్పుడు మంత్రులు చాలా యాక్టీవ్‌గా ఉండేవారు. ఒక్కో రోజు ఐదారుగురు మంత్రులు మీడియా ముందుకు వ‌చ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టే వారు. జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డంలో ముందుండే వారు. స‌హ‌జంగా మంత్రులు మాట్లాడితే మీడియాలోనూ ప్ర‌ముఖంగా వ‌చ్చేది. దీంతో అప్ప‌టి ప్ర‌భుత్వ వాద‌న ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్లేది.

టీడీపీ అధికార ప్ర‌తినిధులు ఉన్నా, వారితో పాటు మంత్రులూ ప్ర‌తీ రోజూ మీడియా ముందుకు వ‌చ్చేవారు. కానీ, వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎక్కువ‌గా జూనియ‌ర్ ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్ క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో వారంతా ఆయా శాఖ‌ల‌కు సంబంధించి అడ‌పాద‌డ‌పా త‌ప్ప ఎప్పుడూ మీడియా ముందుకు రావ‌డం లేదు.

ఇక‌, బాగా మాట్లాడ‌గ‌లిగిన, స‌బ్జెక్ట్ చెప్ప‌గ‌లిగిన సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి వంటి సీనియ‌ర్ల‌ను జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలోకి తీసుకోలేదు. దీంతో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పేర్ని నాని వంటి ఇద్ద‌రు ముగ్గురు మంత్రులు త‌ప్ప మిగ‌తా ఎవ‌రూ మీడియా ముందు క‌నిపించ‌డం లేదు. ఇదే స‌మ‌యం తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శిస్తోంది.

ఈ విమ‌ర్శ‌ల‌ను వైసీపీ అధికార ప్ర‌తినిధులుగా ఉన్న కొంద‌రు తిప్పి కొడుతున్నా టీడీపీ వాద‌న ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లోకి వెళుతోంది. ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రులు మాట్లాడితే ప్ర‌భుత్వ వాద‌న కూడా ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశం ఉండేది. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గుర్తించారు.

నిన్న క్యాబినెట్ భేటీ త‌ర్వాత మంత్రుల‌తో జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. రాజ‌కీయంగా మంత్రులు ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోతున్నార‌ని జ‌గ‌న్ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కార‌ని తెలుస్తోంది. ఇక నుంచి టీడీపీ విమ‌ర్శ‌ల‌పై మంత్రులు ధీటుగా స్పందించాల‌ని జ‌గ‌న్ ఆదేశాలిచ్చారు.

ఇక‌, ఇంఛార్జి మంత్రుల ప‌నితీరు ప‌ట్ల కూడా జ‌గ‌న్ అసంతృప్తిగా ఉన్నారు. వివిధ జిల్లాల‌కు ఇంఛార్జి మంత్రులుగా ఉన్న వారు ఆయా జిల్లాల‌పై అంతా శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఇంఛార్జిలుగా ఉన్న జిల్లాల‌పై మంత్రులు పూర్తి స్థాయిలో శ్ర‌ద్ధ పెట్టాల‌ని జ‌గ‌న్ వారికి సూచించారు. మొత్తానికి ప్ర‌భుత్వ వాద‌న కంటే ప్ర‌తిప‌క్షాల వాద‌న‌నే ప్ర‌జ‌ల్లోకి ఎక్కువ‌గా వెళుతుంద‌ని జ‌గ‌న్ గ్ర‌హించారు. మ‌రి, జ‌గ‌న్ సూచ‌న‌ల‌ను మంత్రులు పాటిస్తారో లేదో చూడాలి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle