newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

మంత్రి బొత్స అసంతృప్తి సెగ‌లు..!

12-11-201912-11-2019 15:07:11 IST
Updated On 12-11-2019 15:08:06 ISTUpdated On 12-11-20192019-11-12T09:37:11.972Z12-11-2019 2019-11-12T09:37:08.697Z - 2019-11-12T09:38:06.875Z - 12-11-2019

మంత్రి బొత్స అసంతృప్తి సెగ‌లు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాల‌కశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న పొలిటిక‌ల్ రేంజ్‌కు తాను ఉంటున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా త‌క్కువ‌ని ఫీలైపోతున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా జ‌రుగుతోంది. వైసీపీలో చేరిన‌ప్పుడే తాను రెండు మెట్లు దిగిన‌ట్టు బొత్స భావిస్తున్నార‌ని విశ్లేష‌కులు చెప్పుకుంటున్నారు.

ఈ విష‌యాన్ని మంత్రి బొత్స ఏదో అల‌వాటులో.. పొర‌పాటుగా నోరుజారి అన్న మాట‌లు కూడా కావ‌ని, ఈ మ‌ధ్యన ఆ విష‌యాన్ని మంత్రి బొత్స ప‌దే ప‌దే చెబుతున్నారంటూ ఆయ‌న అనుచ‌ర‌వ‌ర్గీయులే చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

కాగా, ఏపీ అనంత‌రం కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డిపోయిన త‌రువాత ఆ పార్టీలో ఉండి లాభం లేద‌నుకుని చాలా మంది కాంగ్రెస్ నేత‌లు వైసీపీలో చేరారు. బొత్స కూడా అదేప‌నిచేశారు. కాక‌పోతే మిగిలిన నేత‌లెవ్వ‌రూ వైసీపీలోకి చేరి త‌మ రేంజ్‌ను త‌గ్గించేసుకున్నామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు.

కానీ, బొత్స మాత్రం ఈ మాట‌ను ప‌దే ప‌దే చెబుతున్నారు. లేటెస్ట్‌గా స‌చివాల‌యంలో మీడియా స‌మావేశంలోనూ ఇదేమాట మ‌ళ్లీ ఒక‌సారి అన్నారు. వాస్త‌వానికి బొత్స‌కు వైసీపీలో త‌క్కువైంది ఏమీలేదట‌. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. ఫ్యామిలీ ప్యాకేజీ ప్ర‌కారం టికెట్లూ ద‌క్కాయి. అయినా తాను రెండు మెట్లు దిగి వైసీపీలో చేరిన‌ట్లుగా మ‌రొక‌సారి చెప్పుకొచ్చారు.

ఇంత‌కీ ఈ మాట‌ల‌తో బొత్స ఏం బ‌య‌ట‌పెట్టాల‌నుకున్నారో అర్ధం కావ‌డం లేద‌ని  కేడ‌ర్ అంటుంటే త‌న స్థాయి త‌గ్గింద‌ని అస్త‌మానం అంత బాధ‌ప‌డ‌టం ఎందుకంటూ వారూ విసుక్కుంటుండ‌టం విశేషం. దీంతో ప్ర‌స్తుతం మంత్రి ప‌ద‌వి ద‌క్కినా బొత్స అసంతృప్తిగా ఉన్నారా..? అధినేత వ్య‌వ‌హారంలో ఏవైనా తేడాలు ఉన్నాయా..? అనే చ‌ర్చ ఇప్పుడు జ‌రుగుతోంది.

ఉమ్మ‌డి రాష్ట్రంలో పీసీసీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన బొత్స ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క వ్య‌క్తిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల‌కు పార్టీ అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారుచేసిన స్థాయిలో ఉండి ఇప్పుడు ఒక‌రి కింద ప‌నిచేసే ప‌రిస్థితిని జీర్ణించుకోలేక‌నే అలా అంటున్నార‌న్న చ‌ర్చ కూడా సాగుతోంది.

కిర‌ణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన త‌రువాత సీఎం రేసులోనూ ఉన్నారు. నాడు సీఎం కుర్చీ వ‌ర‌కు వెళ్లిన బొత్స ఆ సీటును ఎక్క‌లేకపోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్నా కూడా అధినేత జ‌గ‌న్ నిర్ణ‌య‌మే ఫైన‌ల్. ప్రాంతీయ పార్టీ క‌నుక అలాంటి ప‌రిస్థితులు ఉండ‌టం స‌హ‌జ‌మే అయినా గ‌త అనుభ‌వాలు మ‌రిచిపోలేక‌నే ఇలా మాట్లాడుతున్నార‌ని భావిస్తున్నారు.

అయితే, పార్టీ బ‌లం లేకుండా సొంతంగా ఎమ్మెల్యేగా నెగ్గ‌లేక‌పోయిన బొత్స ఇప్పుడు ఇలా చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని ఇటు రాజ‌కీయ విశ్లేష‌కుల‌తోపాటు అటు పార్టీ కూడ‌ర్ కూడా చెవులు కొరుక్కుంటున్నారు. రాజ‌కీయాల్లో అంతే మ‌రీ.. అంతా విచిత్ర‌మే అంటూ కొస‌మెరుపు సెటైర్ల‌తో బొత్స‌పై కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle