newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

మంత్రి కిడారి శ్రావణ్ రాజీనామా తప్పదా? ఎందుకు?

08-05-201908-05-2019 15:22:15 IST
Updated On 08-05-2019 18:35:56 ISTUpdated On 08-05-20192019-05-08T09:52:15.725Z08-05-2019 2019-05-08T09:52:12.454Z - 2019-05-08T13:05:56.403Z - 08-05-2019

మంత్రి కిడారి శ్రావణ్ రాజీనామా తప్పదా? ఎందుకు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు కిడారి  శ్రావణ్‌కుమార్‌ రాష్ట్రమంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావుని మావోయిస్టులు హతమార్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రావణ్‌కు  కేబినెట్లో చోటిచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేయనున్నారు. మంత్రిగా నియమితులై ఆరు నెలలవుతున్నా ఇప్పటికీ చట్టసభల్లో సభ్యుడు కాకపోవడమే దీనికి కారణం.

2018 నవంబరు 11న గవర్నర్‌ నరసింహన్‌ శ్రావణ్ కుమార్‌తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే మే నెల పదవతేదీకి ఆయన పదవి చేపట్టి ఆరు నెలలు నిండుతుంది. రాజ్యాంగం ప్రకారం మంత్రిగా ప్రమాణం చేసిన ఆరునెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నికవ్వాలి.  శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యుడిగా ఉండాలి. కానీ ఆ అవకాశం లేదు. ప్రస్తుతం అరకు నుంచి శ్రావణ్ కుమార్ టీడీపీ తరఫున పోటీచేశారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈనెల 23వ తేదీ తర్వాతే విడుదలవుతాయి. దీంతో శ్రావణ్ రాజీనామా తప్పేలా లేదు.

ఈమేరకు గవర్నర్‌ కార్యాలయం ఇదే అంశాన్ని తెలియజేస్తూ శ్రావణ్‌కు సమాచారం పంపిందని చెబుతున్నారు. గవర్నర్‌ కార్యాలయం నుంచి ఎలాంటి సందేశం తనకు అందలేదని శ్రావణ్‌కుమార్‌ చెబుతున్నారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకుంటానని వివరించారు. బుధ గురువారాల్లో రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle