newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

మంత్రి అనిల్-మాజీ మంత్రి లోకేష్ ట్విట్టర్ వార్

21-08-201921-08-2019 12:26:13 IST
Updated On 22-08-2019 15:38:15 ISTUpdated On 22-08-20192019-08-21T06:56:13.378Z21-08-2019 2019-08-21T06:55:29.292Z - 2019-08-22T10:08:15.514Z - 22-08-2019

మంత్రి అనిల్-మాజీ మంత్రి లోకేష్ ట్విట్టర్ వార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనం వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే నేతలు మాత్రం ట్వీట్ల వరదలో కొట్టుకుపోతున్నారు. ఏపీ మంత్రి అనిల్-టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ మధ్య ట్విట్టర్ వార్ ఊపందుకుంది. పడవను అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచివేశారనే నారా లోకేష్‌ వాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం అంటూ మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు.

చంద్రబాబు ఒక అబద్ధం చెబితే.. లోకేష్‌ పది చెబుతున్నారు. వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. లోకేష్‌ వారిని పరామర్శించకుండా ట్వీట్‌లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

కృష్ణమ్మ శాంతించడంతో వరద ముంపునకు గురయిన లంక గ్రామాల ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇదేమీ పట్టన్నట్లు సాహో సినిమాను టీడీపీ శ్రేణులు చూడాలని లోకేష్‌ ట్వీట్‌ చేయడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది.

మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి సమయాల్లో ఎలా స్పందించాలో తెలియకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తన అజ్ఞాతాన్ని వీడి జనంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారు. అంతకుముందు మంత్రి అనిల్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు లోకేష్.

Image may contain: 3 people, text

నోటి పారుదల మంత్రిగారు నోరు తెరిస్తే అబద్దాలు. మొన్న తప్పుడు లెక్కలతో తడబడ్డారు. ఇప్పుడు విషయంపై అవగాహన లేక, నోటికొచ్చిన అబద్దాలు చెప్పి ప్రజల ముందు బొక్కబోర్లా పడ్డారని ట్వీట్ చేశారు. 

Image may contain: text


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle