newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

మంత్రి అనిల్‌పై తేనెటీగల దాడి.. స్వల్పగాయాలు

29-11-201929-11-2019 15:27:09 IST
Updated On 29-11-2019 15:59:13 ISTUpdated On 29-11-20192019-11-29T09:57:09.571Z29-11-2019 2019-11-29T09:57:07.022Z - 2019-11-29T10:29:13.461Z - 29-11-2019

మంత్రి అనిల్‌పై తేనెటీగల దాడి.. స్వల్పగాయాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తేనెటీగలు దాడిచేశాయి. తేనెటీగల దాడిలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కర్నూలు జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా బానకచర్లలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆయన బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే వారందరూ పరుగులు తీసినప్పటికీ.. మంత్రి గన్‌మెన్లు సహా 50మందికి పైగా గాయాలు అయ్యాయి.

మంత్రి అనిల్ తో పాటు.. ఎమ్మెల్యే ఆర్థర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించినట్టు తెలుస్తోంది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి పోలీసులు, సహచరులు రక్షణగా ఉన్నారు. తేనె టీగల దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. వెంటనే అక్కడున్నవారంతా మరో చోటికి వెళ్లిపోయారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle