newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

మంత్రిగారికి ఈసారి క‌ష్టమేనా..?

04-04-201904-04-2019 12:25:42 IST
Updated On 09-07-2019 12:04:01 ISTUpdated On 09-07-20192019-04-04T06:55:42.881Z04-04-2019 2019-04-04T06:55:41.068Z - 2019-07-09T06:34:01.076Z - 09-07-2019

మంత్రిగారికి ఈసారి క‌ష్టమేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీలో బ‌ల‌మైన నేత‌లు, మంత్రులుగా ప‌నిచేసిన వారిని ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి భారీగానే క‌స‌ర‌త్తు చేసింది. వారికి ధీటుగా బ‌ల‌మైన అభ్యర్థుల‌ను నిల‌బెట్టారు వైసీపీ అధినేత జ‌గ‌న్.  మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిలుక‌లూరిపేట ఆయ‌న‌కు గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు గానూ జ‌గ‌న్ బీసీ కార్డు ప్రయోగించారు. దీంతో ఇక్కడ పోరు హోరాహోరీగా మారిపోయింది. పారిశ్రామిక‌వేత్త అయిన ప్రత్తిపాటి పుల్లారావు 1999 నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి మూడు సార్లు విజ‌యం సాధించారు. 

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌పై సుమారు 10 వేల ఓట్ల మెజారిటీతో ఆయ‌న గెలుపొంది మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కించుకున్నారు. ఆర్థికంగా బ‌ల‌వంతుడైన ప్రత్తిపాటి ఈ ఐదేళ్ల కాలంలో నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని నేత‌గా ఎదిగారు. నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. దీంతో ఈసారి ప్రత్తిపాటిని ఢీకొట్టాలంటే ఆర్థికంగా బ‌ల‌మైన వారిని రంగంలోకి దింపాల‌ని జ‌గ‌న్ భావించారు. ఇదే స‌మ‌యంలో టీడీపీలో కొంత‌కాలం ప‌నిచేసిన ఎన్ఆర్ఐ మ‌హిళ విడ‌ద‌ల ర‌జనీ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 

బీసీ మ‌హిళ అయిన ఆమెను ఆరు నెల‌ల‌ క్రిత‌మే నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇంఛార్జిగా నియ‌మించి టిక్కెట్‌పై కూడా హామీ ఇచ్చారు. మొద‌ట కొత్తగా వ‌చ్చిన ఆమె కంటె ఇప్పటికే ఎమ్మెల్యే ప‌నిచేసిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ బ‌ల‌మైన అభ్యర్థి అని అంతా భావించారు. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వ‌ర్గం కూడా తీవ్ర అసంతృప్తికి గురైంది. అనంత‌రం ఆయ‌న పార్టీ విజ‌యం కోసం కృషి చేసేందుకు అంగీక‌రించారు. ర‌జ‌నీ కూడా పాత‌వారిని క‌లుపుకొని పోతున్నారు. ఆరు నెల‌లుగా నియోజ‌క‌వ‌ర్గంలో నిత్యం ఏవో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజ‌ల్లోనే ఉంటున్నారామె.

దీంతో అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులై ప్రత్తిపాటి పుల్లారావుకు ఆమె బ‌ల‌మైన ప్రత్యర్థిగా మారారు. పైగా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కూడా పూర్తిగా స‌హ‌క‌రిస్తున్నారు. ఇటీవ‌ల జ‌గ‌న్ చిలుక‌లూరిపేట‌కు ప్రచారానికి వ‌చ్చి ఈ స్థానాన్ని గెలిపిస్తే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను మంత్రిగా చేస్తాన‌ని ప్రక‌టించారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో మ‌రింత ఉత్సాహం వ‌చ్చింది. అయితే, పార్టీ అధికారంలో లేన‌ప్పుడే 2009, 2014లో ప్రత్తిపాటి పుల్లారావు సులువుగా విజ‌యం సాధించారు. ఇక‌, ఈ ఐదేళ్లు మంత్రిగా ఆయ‌న అభివృద్ధి చేయ‌డంతో పాటు ఇంకా బ‌ల‌మైన నేత‌గా మారారు. ఆయ‌న‌కు విడ‌ద‌ల ర‌జ‌నీ గ‌ట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయం. అయితే ఆయ‌న‌పై గెలవ‌గ‌ల‌రా అనేది మాత్రం ఇంకా అనుమానంగానే ఉంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle