newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

‘మంచు’ వారి స్ట్రాంగ్ పంచ్.. జగనే ఏపీ సీఎం!

26-03-201926-03-2019 14:51:33 IST
2019-03-26T09:21:33.026Z26-03-2019 2019-03-26T09:21:29.796Z - - 20-09-2019

‘మంచు’ వారి స్ట్రాంగ్ పంచ్.. జగనే ఏపీ సీఎం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీనటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు ఎన్నికల వేళ చంద్రబాబుకి స్ట్రాంగ్ పంచ్ విసిరారు. మోహన్‌బాబు వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో ఆ పార్టీ అధినేత జగన్‌ను ఆయన మంగళవారం ఉదయం కలిశారు. జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. జగన్‌ ఏపీలో స్వీప్‌ చేస్తారని, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు వందేళ్లు సంతోషంగా బతకాలని కోరుకుంటున్నానని, కానీ ఎన్నికల్లో ఓడిపోవాలని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంలో అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈమధ్యకాలంలో మోహన్ బాబు టీడీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. దీంతో మోహన్ బాబు వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది.

దీనికి తగ్గట్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మోహన్ బాబుతో బంధుత్వం కూడా ఉంది. పెద్దకొడుకు మంచువిష్ణు భార్య వెరోనికా జగన్‌కు వరుసకు సోదరి అవుతుంది. వైఎస్ బతికి ఉన్నప్పుడే మోహన్ బాబు కాంగ్రెస్‌లో చేరతారని భావించారు. అక్రమాస్తుల కేసులో జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నప్పుడు మోహన్ బాబు కూడా ఆయన్ని పరామర్శించారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి జరిగాక జగన్‌ని పరామర్శించారు మోహన్ బాబు. తాజాగా ఏపీ ఎన్నికల వేళ మోహన్ బాబు టీడీపీ అధినేత చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇప్పటివరకూ మా విద్యాసంస్థకు రూ.19 కోట్ల బకాయిలు ఏపీ ప్రభుత్వం నుంచి రావాలి. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ అనుకున్న సమయానికి ఇవ్వాలి. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు మూడు నెలలకోసారి ఇస్తానన్నారు. కానీ సక్రమంగా ఇవ్వలేకపోయారు. తెలంగాణలో బాకీలు లేవన్నారు మోహన్ బాబు. 

మరోవైపు తాను పదవులకోసం ఆశపడేవాడిని కాదన్నారు.  ఏ పదవీ ఆశించి తాను వైసీపీలో చేరడం లేదని నటుడు మంచు మోహన్‌ బాబు స్పష్టం చేశారు. జగన్‌ సీఎం అయితే ఏపీ ప్రజలకి మంచి జరుగుతుంది అని మాత్రమే పార్టీలో చేరాను అని చెప్పారు. వైకాపాలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిజంగా పదవులపై మోహం ఉండుంటే 15 ఏళ్ల క్రితం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే ఏదో ఒక పదవిలో ఉండేవాడినని అన్నారు. మొత్తం మీద మోహన్ బాబు రాజకీయ ప్రస్థానంపై విభిన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.  


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle