newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

మంగళగిరిపై బెట్టింగ్ రాయుళ్ళ గురి

16-04-201916-04-2019 13:13:54 IST
Updated On 16-04-2019 15:13:30 ISTUpdated On 16-04-20192019-04-16T07:43:54.968Z16-04-2019 2019-04-16T07:43:50.947Z - 2019-04-16T09:43:30.023Z - 16-04-2019

మంగళగిరిపై బెట్టింగ్ రాయుళ్ళ గురి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా మే 19 వరకూ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. తొలిదశలో ఈనెల 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు కూడా ముగిశాయి. ఫలితాల ప్రకటన మే 23వ తేదీన జరగనుంది. దీంతో ఫలితాలకు ఇంకా 40 రోజుల సమయం ఉంది. అయితే ఎన్నికల్లో ఏయే స్థానాల్లో ఏయే పార్టీ అభ్యర్థులు ఎంత మెజార్టీతో గెలుస్తారు.? ఎవరు ఓడతారు.? ఓడితే ఎంత మెజార్టీతో ఓడతారు.? ఇలా బెట్టింగ్‌ రాయుళ్ల పందేలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్‌ రాయుళ్ల ఫోకస్‌ అంతా మంగళగిరిపైనే ఉంది. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ పోటీచేస్తుండడం... ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండడంతో ఎవరు గెలుస్తారు.. గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది? అనే అంశాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి.

కీలకమయిన రాజధాని ప్రాంతం వున్న మంగళగిరి నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లున్నాయి. ఇక్కడ 85 శాతం పోలింగ్‌ నమోదు అయింది. క్షేత్ర స్థాయిలో ఓటర్‌ పల్స్‌ని పసిగట్టిన పంటర్లు మాత్రం వైఎస్సార్‌ సీపీపైనే పందెం వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. లోకేశ్‌ గెలుస్తాడు అని బెట్టింగ్‌ వేసే వారికి ఒకటికి ఒకటిన్నర నుంచి రెండు రెట్లు ఇస్తామంటున్నారు.

అంటే లోకేశ్‌ వైపు రూ.లక్ష పందెం కాస్తే లోకేష్ గెలిస్తే మాత్రం లక్షా యాభైవేల నుంచి రెండు లక్షలు ఇస్తామంటున్నారు.  భారీగా పోలింగ్‌ నమోదవడంతో పాటు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలు, ఎస్సీలు ప్రతిపక్షం వైపు మొగ్గు చూపినట్లు భావిస్తున్నారు. మళ్లీ ఆర్కె గెలిస్తే మాత్రం లోకేష్‌పై పందెం కాసిన వారు బికారులుగా మారడం ఖాయం. 

మంగళగిరిలో గెలుపుపై టీడీపీ నేతలు అంత ధీమాగా లేరు. చంద్రబాబు వేగులు కూడా సానుకూల ఫలితాలు రాకపోవచ్చని చెప్పారట. దీంతో ఆ పార్టీ ఇక్కడ గెలుపుపై తీవ్ర కసరత్తు చేసింది. అయితే ఎలక్షన్‌ ముందు రోజు చాలా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు లోకేశ్‌కు హ్యాండ్‌ ఇచ్చారు. డబ్బులు అందగానే వారి ‘దారి’ వారు చూసుకున్నారు. దీనికి తోడు లోకేశ్‌ గెలిస్తే తాడేపల్లి మండలంలో కొండలపై ఉన్న వారి ఇళ్లను తొలగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది.

వీరంతా గంపగుత్తగా ఆర్కే  వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అలాగే భూ సేకరణ వల్ల ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగిన రైతులు, ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇచ్చి నష్టపోయిన రైతులు... చేనేతలు ఇలా అందరూ టీడీపీకి వ్యతిరేకంగా ఓటు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ప్రకటించడం కూడా లోకేష్ గెలుపుపై మరింత ఆందోళన కలిగిస్తోంది.

దీంతో అప్పటిదాకా ఉన్న సమీకరణాల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. ఆర్కే మంత్రిగా ఉంటే తమ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తటస్థులుగా ఉన్న ఓటర్లు భావించారు. దీంతో అన్ని వర్గాల ఓటర్లతో స్పష్టంగా ఆర్కేను గెలిపించుకుందామనే భావన వ్యక్తమవడంతో లోకేశ్‌ ఓడిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బెట్టింగ్ రాయుళ్ళు మాత్రం ఆర్కె గెలుపుపైనే ఫోకస్ పెట్టారు. ఈసారి ఆర్కె 10 వేల మెజారిటీతో గెలుస్తారని మంగళగిరి వాసులు చెబుతున్నారు. అదే జరిగితే చంద్రబాబుకి షాక్ తప్పదంటున్నారు. 

మరోవైపు, ఐపీఎల్ మ్యాచ్‌ల కంటే ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల మీదే జ‌నం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు పందెం రాయుళ్లు చెబుతున్నార‌ు. లోకేష్‌తో పాటు ముఖ్యంగా అఖిల ప్రియారెడ్డి, గంటా శ్రీనివాస్ మీద జోరుగా పందేలు సాగుతున్నట్లు ఏపీ పోలీసులు అనుమానిస్తున్నారు. పోలింగ్ త‌ర్వాత స‌ర్వే నిర్వహించిన బెట్టింగ్ రాయుళ్లు, ప‌రిస్థితికి అనుగుణంగా పందెం ఎంతో చెబుతున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. గుంటూరు, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం ప్రాంతాల్లో పందెం రాయుళ్లు పాగా వేసిన‌ట్లు తెలుస్తోంది. వీరిని ప‌ట్టుకునేందుకు ఏపీ పోలీసులు కూపీ లాగుతున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle