newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

మంగళగిరిని అందుకే ఎంచుకున్నారా?

18-03-201918-03-2019 17:12:44 IST
2019-03-18T11:42:44.492Z18-03-2019 2019-03-18T11:42:40.209Z - - 22-09-2019

మంగళగిరిని అందుకే ఎంచుకున్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయట. ఏపీలో తొలగించినట్లుగా చెబుతున్న మొత్తం 25 లక్షల 47 వేల ఓట్లలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 6 లక్షల ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 23 వేల ఓట్లు తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ సీటు నుంచి వైసీపీ కేవలం 12 ఓట్లతో గెలిచింది. ఈసారి కూడా గట్టి పోటీ ఉంటుందని భావించిన చంద్రబాబు ప్రభుత్వం... ముందుగానే మంగళగిరిలో వైసీపీ ఓట్లు తొలగించినట్లు తెలుస్తోంది. అంతేకాదట... మంగళగిరి నియోజకవర్గంలో 13 వేల దొంగ ఓట్లను సృష్టించారని వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. 

అంటే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే లోకేష్ పేరు ఆలస్యంగా తెర మీదకు తెచ్చినట్లు సమాచారం. మరోవైపు అధికార టీడీపీ నుండి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలకు నారా లోకేష్ సిద్ధం కావడంతో అందరి దృష్టి ఆయనపైనే ఉంది. రాజధాని ప్రాంతమైన మంగళగరి నుండి ఆయన పోటీ చేస్తుండటంతో టీడీపీ తొలిగురి మంగళగిరి‌గా మారింది. మంగళగిరి నుండి లోకేష్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమే అంటున్నారు మహేష్ సోదరి, గల్లా జయదేవ్ భార్య పద్మావతి.

నారా లోకేష్‌తో కలిసి మంగళగిరిలో ఆమె ప్రచారం చేశారు. లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందంటున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు.  మంగళగిరి అసెంబ్లీ అభ్యర్ధిగా లోకేష్ ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం మొదలుపెట్టారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle