newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

మంగళగిరి...ఎందుకంత హాట్ సీట్

15-03-201915-03-2019 07:27:45 IST
Updated On 15-03-2019 11:45:10 ISTUpdated On 15-03-20192019-03-15T01:57:45.443Z15-03-2019 2019-03-15T01:57:32.875Z - 2019-03-15T06:15:10.068Z - 15-03-2019

మంగళగిరి...ఎందుకంత హాట్ సీట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపు ఇప్పుడు మంగళగిరి మీద ఉంది. రాజధాని పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి మంత్రి నారా లోకేష్ ఇక్కడ పోటీ చేయడమే ఇందుకు కారణం. లోకేష్ ఇక్కడ గెలుస్తారా, ఎంత మెజార్టీ వస్తుంది, వైసీపీ పరిస్థితి ఏంటి అన్న విషయాల మీద జనం ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నారు లోకేష్.

మొదటి నుంచీ చంద్రబాబు పాలనలో అవినీతి జరిగిందంటూ పోరాటాలు చేస్తున్నారు ఆర్ కె. ముఖ్యంగా వేలంపాట పేరుతో సదావర్తి భూములను టీడీపీ నేతలు చౌకగా కొట్టేయకుండా అడ్డుకుంది ఆయనే. తాజాగా డీజీపీ ఠాకూర్ ని మార్చాలని ఈసీకి లేఖరాసింది కూడా ఆయనే. అలాగే రాజధాని నిర్మాణంలో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటున్నారని కోర్టులో కేసులు పెట్టించి, స్టే తెప్పించింది కూడా ఆళ్లనే. 

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును వెంటాడుతోంది కూడా ఆళ్లనే. దాదాపు ఏడాది నుంచి మంగళగిరిలో రాజన్న భోజనం పేరుతో 4 రూపాయలకే భోజనం పెడుతున్నారు. వీటన్నింటితో మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో చాలా దగ్గర అయ్యారు ఆళ్ల. ఇక టీడీపీ విషయానికొస్తే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ 1985లో చివరిసారిగా పోటీ చేసింది. అంటే దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ అభ్యర్ధి పోటీలో లేరు. 

ఈ పరిస్థితుల్లో లోకేష్ ఇక్కడ నుంచి పోటీ చేయడం అంటే సాహసమే. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం మీద తాను చేసిన ఆరోపణలను నిజమని రుజువు చేశారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి. ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఆళ్ల ఈ విషయాలను ప్రస్తావిస్తే దానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి టీడీపీలో కనిపించడం లేదు. అదే ఇప్పుడు లోకేష్‌ను బాగా ఇబ్బంది పెడుతోంది. మొత్తానికి లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం హాట్ సీటుగా మారింది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle