newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

భ‌విష్య‌త్‌పై సీమ టీడీపీ నేతల్లో బెంగ‌

09-07-201909-07-2019 07:44:35 IST
Updated On 10-07-2019 12:11:19 ISTUpdated On 10-07-20192019-07-09T02:14:35.993Z09-07-2019 2019-07-09T02:14:03.864Z - 2019-07-10T06:41:19.376Z - 10-07-2019

భ‌విష్య‌త్‌పై సీమ టీడీపీ నేతల్లో బెంగ‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొన్న‌టి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓట‌మిలో రాయ‌ల‌సీమ‌దే కీల‌కపాత్ర‌. సీమ‌లో తెలుగుదేశం పార్టీ ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకుంది. సీమ‌లోని నాలుగు జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ సీట్ల‌లో కేవ‌లం మూడు స్థానాల‌కే టీడీపీ ప‌రిమితం అయ్యింది. అందులో టీడీపీకి కంచుకోట‌ల్లాంటి కుప్పం, హిందూపురంతో పాటు ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది.

వైఎస్సార్ కాంగ్రెస్ మిగ‌తా 49 సీట్ల‌లో ఘ‌న విజ‌యం సాధంచింది. టీడీపీకి ఆది నుంచీ పట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. హేమాహేమీలుగా చెప్పుకునే నేత‌లు సైతం ఓట‌మి పాల‌య్యారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ వైసీపీ రాయ‌ల‌సీమ‌లో టీడీపీ కంటే ఎక్కువ సీట్లు సాధించింది. ఈసారి ఏకంగా క్లీన్ స్వీప్ చేసేసింది. దీంతో ఇప్పుడు రాయ‌ల‌సీమ తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో భ‌విష్య‌త్‌పై బెంగ ఏర్ప‌డింది.

రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి గ‌ట్టి ప‌ట్టుంది. గ‌త ఎన్నిక‌ల్లో అనంత‌పురం మిన‌హా మిగ‌తా మూడు జిల్లాల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలిచింది. సీమ‌లో వైసీపీ ప‌ట్టు పెర‌గ‌డానికి, క్లీన్ స్వీప్ చేయ‌డానికి గ‌త ఐదేళ్లు టీడీపీ అవ‌లంభించిన రాజ‌కీయం కూడా ఒక కార‌ణ‌మే. టీడీపీ హ‌యాంలో రాయ‌లసీమను నిర్ల‌క్షం చేశార‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో కొంత ఉంది.

రాయల సీమ‌కు టీడీపీ ప్ర‌భుత్వం సాగు నీరు అందించే ప్ర‌య‌త్నం చేసినా ఎన్నిక‌ల్లో మాత్రం ఇది ప‌నిచేయ‌లేదు. ఇందుకు ఒక కార‌ణం టీడీపీనే వైసీపీని రాయ‌ల‌సీమ‌ను ఓన్ చేసుకునేలా చేసింది.

త‌ర‌చూ చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌లు రాయ‌ల‌సీమ సంప్ర‌దాయం, క‌డ‌ప రౌడీలు వంటి ప‌దాలు ఉప‌యోగించి జ‌గ‌న్‌ను సీమ ప్ర‌జ‌లు త‌మ‌వాడ‌ని భావించుకునేలా చేశారు. పైగా సీమ‌లో ఈసారి జ‌గ‌న్ ఉప‌యోగించి సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌రణాల ఫార్ములా బాగా వ‌ర్కౌంట్ అయ్యింది. 2014 అధికారంలోకి వ‌చ్చినా సీమ‌లో వైసీపీకి మెజారిటీ సీట్లు రావ‌డం, ఈసారి ఏకంగా వైసీపీ స్వీప్ చేయ‌డంతో ఇక సీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్ ఏంట‌ని ఆ పార్టీ నేత‌ల్లోనే బెంగ నెల‌కొంది.

పార్టీలోనే ఉండాలా, ఉంటే భ‌విష్య‌త్ ఉంటుందా అనే ఆలోచ‌న‌లో తెలుగు త‌మ్ముళ్లు ఉన్నారు. సీమ‌లోని రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అధికారంలో లేని నేత‌లు అనేక స‌మ‌స్య‌లు ప్ర‌త్య‌ర్థుల నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

ఐదేళ్లు ఎలాగోలా భరిద్దామ‌నుకున్నా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి గెలుస్తామ‌న్న ధీమా వారిలో లేన‌ట్లు క‌నిపిస్తోంది. త‌మ‌కు వ్య‌క్తిగ‌తంగా నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లం ఉన్నా పార్టీప‌రంగా వైసీపీ హ‌వాను సీమ జిల్లాల్లో త‌ట్టుకోలేమ‌ని భావిస్తున్నారు.

ఇటీవ‌ల త‌మ ఓట‌మికి కూడా టీడీపీ వారంతా ఇదే కార‌ణం చెబుతున్నారు. దీంతో ఈ ఐదేళ్లు ఇబ్బంది ప‌డ‌టం ఎందుక‌నే భావ‌న‌తో కొంంద‌రు బీజేపీ వైపు చూస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, సీమ‌లో టీడీపీకి పూర్వ‌వైభవం తీసుకువ‌చ్చేందుకు చంద్ర‌బాబు తీవ్రంగా శ్ర‌మిస్తే త‌ప్ప వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కొంతైనా పుంజుకునే అవ‌కాశం ఉంది. 

పైగా తాను అధికారంలో ఉండే ఐదేళ్లు జ‌గ‌న్ స‌హ‌జంగానే సీమ అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టవ‌చ్చు.  మొత్తంగా భ‌విష్య‌త్‌పై బెంగ‌తో ఉన్న రాయ‌ల‌సీమ తెలుగుత‌మ్ముళ్ల‌లో చంద్ర‌బాబు ఏవిధంగా ధైర్యం నింపుతారో చూడాలి.

 

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   2 hours ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   3 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   4 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   9 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   11 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   11 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   11 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   11 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   11 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   12 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle