newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

భూమా కుటుంబానికి షాక్ తప్పదా.. .?

29-04-201929-04-2019 07:44:50 IST
Updated On 04-07-2019 10:54:12 ISTUpdated On 04-07-20192019-04-29T02:14:50.778Z29-04-2019 2019-04-29T02:08:21.425Z - 2019-07-04T05:24:12.659Z - 04-07-2019

భూమా కుటుంబానికి షాక్ తప్పదా.. .?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక ముద్ర వేసుకుంది భూమా కుటుంబం. ఈ కుటుంబం నుంచి ఇద్ద‌రు వార‌సులు అనూహ్యంగా రాజ‌కీయ తెర‌పైకి వ‌చ్చి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. త‌ల్లి భూమా శోభానాగిరెడ్డి మ‌ర‌ణంతో కూతురు అఖిలప్రియ ఏక‌గ్రీవంగా ఆళ్ల‌గ‌డ్డ నుంచి విజ‌యం సాధించారు. ఆమె త‌ర్వాత మంత్రి కూడా అయ్యారు. ఇక‌, నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఆయ‌న అన్న కుమారుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి నంద్యాల బై ఎల‌క్ష‌న్ లో విజ‌యం సాధించారు.

ఈసారి కొట్లాడి మ‌రీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద భూమా వార‌సులు త‌మ టిక్కెట్ల‌ను తెచ్చుకున్నారు. త‌ల్లిదండ్రులు లేకుండా మొద‌టిసారి వార‌సులే ఎన్నిక‌ల‌ను ఎదుర్కున్నారు. మ‌ళ్లీ రెండు సీట్ల‌నూ గెలుచుకునేందుకు భూమా వార‌సులు తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డారు. వీరికి ప్ర‌త్య‌ర్థులుగా కూడా రెండు బ‌ల‌మైన కుటుంబాల వార‌సులే ఉండ‌టంతో ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా జ‌రిగాయి.

ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌ప్రియ‌పై వైసీపీ నుంచి గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి కుమారుడు గంగుల బిజేంద్ర‌నాథ్ రెడ్డి(నాని) పోటీ చేశారు. గంగుల కుటుంబానికి ఆళ్ల‌గ‌డ్డ‌లో గ‌ట్టి ప‌ట్టుంది. 40 ఏళ్లుగా గంగుల కుటుంబం నుంచి మూడు త‌రాల నాయ‌కులు ఇక్క‌డ రాజ‌కీయం చేస్తున్నారు. 1985 నుంచి ఇక్క‌డ గంగుల‌, భూమా కుటుంబాల మ‌ధ్యే ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఎక్కువ‌సార్లు భూమా కుటుంబ‌మే గెలిచినా గంగుల కుటుంబం సైతం ప‌ట్టు వ‌ద‌ల‌కుండా పోరాడుతుంది.

భూమా అఖిల‌ప్రియ ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో సానుభూతి ఉంది. మంత్రిగా కొంత అభివృద్ధి చేయ‌గ‌లిగారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేర‌నే పేరు కూడా ఉంది. గంగుల నానికి రెండేళ్ల క్రిత‌మే జ‌గ‌న్ టిక్కెట్ ఖ‌రారు చేశారు. దీంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో బాగా ప‌ట్టు సంపాదించారు. ఇంత‌కాలం విడిగా ఉన్న గంగుల సోద‌రులంతా ఏక‌తాటిపైకి రావ‌డం నానికి క‌లిసొచ్చింది. మొత్తంగా నాని గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఇద్ద‌రిలో ఎవ‌రు గెలిచినా స్వ‌ల్ప మెజారిటీనే ఉండే అవ‌కాశం ఉంది.

ఇక‌, నంద్యాల బైఎల‌క్ష‌న్ లో భారీ మెజారిటీతో విజ‌యం సాధించిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఈసారి ఎదురీదారు. ఆయ‌న‌పై శిల్పా మోహ‌న్ రెడ్డి కుమారుడు శిల్పా ర‌విచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేశారు. దీంతో ఇక్క‌డ కూడా ఇద్ద‌రు యువ‌నేత‌ల మ‌ధ్య పోటీ జ‌రిగింది. ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు పూర్తిగా నెర‌వేర్చ‌క‌పోవ‌డం టీడీపీకి మైన‌స్ గా మారింది. వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌వి కూడా చాలా రోజులుగా ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఓడిపోయార‌నే సానుభూతి శిల్పా కుటుంబానికి ఉంది. 

నంద్యాల‌లో అభ్య‌ర్థుల గెలుపోట‌ములు జ‌న‌సేన అభ్య‌ర్థి శ్రీధ‌ర్ రెడ్డిపై ఆధార‌ప‌డి ఉన్నాయి. ఇక్క‌డ ఆయ‌న ఎన్ని ఓట్లు చీల్చుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. నంద్యాల‌లో ఎస్పీవై కుటుంబానికి మంచి ప‌ట్టుంది. ఆ కుటుంబం నుంచి శ్రీధ‌ర్ రెడ్డి మొద‌టిసారి పోటీ చేశారు. ఆయ‌న టీడీపీ ఓట్లు చీలిస్తే వైసీపీకి క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ ఆయ‌న రెడ్డి సామాజ‌క‌వ‌ర్గం ఓట్లు చీలిస్తే మాత్రం టీడీపీకి ప్ల‌స్ కానుంది. మొత్తంగా భూమా వార‌సుల‌కు వైసీపీ నుంచి ఇద్ద‌రు యువ నాయ‌కులు చెక్ పెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. క‌చ్చితంగా భూమా కుటుంబం ఈసారి ఒక సీటు కోల్పోయే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle