newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

భీమవరం సెంటిమెంట్ పవన్‌కు వరం అవుతుందా?

20-03-201920-03-2019 08:40:02 IST
Updated On 20-03-2019 08:40:25 ISTUpdated On 20-03-20192019-03-20T03:10:02.568Z20-03-2019 2019-03-20T03:09:29.883Z - 2019-03-20T03:10:25.139Z - 20-03-2019

భీమవరం సెంటిమెంట్ పవన్‌కు వరం అవుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీచేస్తారనే ప్రకటనతో ఒక్కసారిగా భీమవరం పేరు తెరమీదకు వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమయిన ప్రాంతంగా, సంపన్నుల నిలయంగా పేరుంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇక్కడ ఒక సెంటిమెంట్ బలంగా  నాటుకుని ఉంది. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉన్నచరిత్ర ఏంటంటే...అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీ అధికారంలోకి  రావడం రివాజుగా మారింది. 1989లో అల్లూరి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందాడు. ఆ తర్వాత వెంకట నరసింహ రాజు పెన్మెత్స టీడీపీ అభ్యర్థిగా 1994, 1995లో విజయం సాధించారు. 2004లో గ్రంధి శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థిగా, 2009లో రామాంజనేయులు పులపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో రామాంజనేయులు పులపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే దాదాపు గెలిచిన అభ్యర్థుల పార్టే అధికారంలోకి రావడంతో ఇక్కడ ఈ సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో  ఈసారి టిడిపి, వైసీపీ, జనసేన పార్టీలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మూడుపార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగితే ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉండవు. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కీలకం అవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే పవన్ మరో కుమారస్వామిలా మారే అవకాశం ఏర్పడుతుంది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle