newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

భీమవరం డౌటేనా.. గాజువాక గట్టెక్కించేనా?

12-04-201912-04-2019 12:53:05 IST
Updated On 06-07-2019 15:22:46 ISTUpdated On 06-07-20192019-04-12T07:23:05.018Z12-04-2019 2019-04-12T07:23:01.752Z - 2019-07-06T09:52:46.708Z - 06-07-2019

భీమవరం డౌటేనా.. గాజువాక గట్టెక్కించేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అన్నబాటలో రెండుచోట్ల పోటీచేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకచోట అయినా గెలుస్తారా? భీమవరంలో పరిస్థితేంటి? గాజువాకలో గట్టెక్కుతారా? ఇవే ప్రశ్నలు ఏపీలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన పోటీ చేసిన విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో పోలింగ్‌ సరళి క్షణక్షణం ఉత్కంఠభరింతంగా సాగింది. మొత్తం 3లక్షల పైచిలుకు ఓట్లతో జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో పోటీ త్రిముఖంగా సాగింది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నుంచి తీవ్ర పోటీ తప్పదని భావించినా, టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల కారణంగా ఆయన దూకుడు తగ్గించారనే ప్రచారం సాగుతోంది.

దీంతో అక్కడ వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి బలమైన పోటీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన నాగిరెడ్డి సానుభూతిని తెరమీదకు తెచ్చారు. అంతేకాదు ఇక్కడ  అయిదు రోజులుగా భారీస్థాయిలో తాయిలాలు పంచారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు పవన్‌కల్యాణ్‌కు గాజువాకలో అనేక ఇబ్బందులు స్వాగతం పలికాయి. 

ఒక బహిరంగసభ రద్దు కావడం, వడదెబ్బ కారణంగా గాజువాకలో విస్తృత ప్రచారం చేసే అవకాశం దొరక్కపోవడం ఇబ్బంది అయిందంటున్నారు.  గురువారం పోలింగ్‌ సందర్భంగా నెలకొన్న పరిస్థితులు కూడా పవన్‌ విజయావకాశాల్ని సంక్లిష్టం చేశాయని తెలుస్తోంది. చాలామంది పవన్‌ అభిమానులు పోలింగ్‌ బూత్‌లకు వచ్చినా.. ఈవీఎంలు మొరాయించడంతో కొందరు వెనక్కి వెళ్లిపోయారు. ఓటు వేయడానికి క్యూలైన్లలో గంటలపాటు నిరీక్షించి చివరాఖరికి విసుగుతో వెళ్లిపోయారు.

గాజువాకలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అనేకమంది ఇళ్ళనుంచి బయటకు రావడానికి వెనుకాడారు.  చాలామంది ఓటింగ్‌కు హాజరుకాలేదు. అయితే పవన్‌కు గంగవరం, అగనంపూడి, కూర్మన్నపాలెం, దువ్వాడ, మింది, వడ్లపూడి తదితర ప్రాంతాల నుంచి గట్టి మద్దతు లభించిందంటున్నారు.  టీడీపీకి ఉన్న బలమైన ఓటుబ్యాంకు, అభిమానులు, మహిళల మద్దతుతో గాజువాకలో పవన్ గెలుపు అంత ఈజీ కాదంటున్నారు.  భీమవరంలో కష్టమయినా గాజువాకలో గెలిస్తే చాలని జనసేన నేతలు అంటున్నారు. అదే జరిగితే అన్నయ్య చిరంజీవికి ఎదురైన అనుభవం తమ్ముడికి కూడా ఎదురవుతుందంటున్నారు. 2009లో పాలకొల్లు నుంచి పోటీచేసిన చిరంజీవి ఓటమి పాలయ్యారు. రెండోచోట పోటీచేసిన తిరుపతిలో ఆయన గెలిచారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle