newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

భానుడి భ‌గ‌భ‌గ‌లు-జ‌నం అవ‌స్థ‌లు

28-05-201928-05-2019 08:36:44 IST
Updated On 28-05-2019 18:18:37 ISTUpdated On 28-05-20192019-05-28T03:06:44.818Z28-05-2019 2019-05-28T03:06:36.426Z - 2019-05-28T12:48:37.874Z - 28-05-2019

భానుడి భ‌గ‌భ‌గ‌లు-జ‌నం అవ‌స్థ‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు మండుతున్న‌ది, జ‌నం బ‌య‌టికి రావాలంటేనే జంకుతున్నారు.47 నుంచి  48 డిగ్రీలు నమోదయ్యే అవకాశం వుంద‌ని ఏపీ విప‌త్లుల నిర్వ‌హ‌ణ శాఖ హెచ్చ‌రించింది.రుతుపవనాలదాకా ఇదే ప‌రిస్థితి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు చెబుతున్నారు.  రోహిణి కార్తె.. రోళ్లు పగిలే మంటలు రేపనుంది. భానుడి ఉగ్రరూపంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారనుందని ఆర్‌టీజీఎస్ తెలిపింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠంగా 47నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.

నైరుతి రుతుపవనాల రాకలో జాప్యంతో వేడి పెరుగుతుందని వాతావ‌ర‌ణ నిపుణులు చెబుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేప్పుడు ప్రజలు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లా విజయపురం 46.02 డిగ్రీలు, నగరి 46 డిగ్రీలు, వ‌డమాలపేట 45.83 డిగ్రీలు, రాష్ట్రమంతా 45డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు.అయింది.

వడదెబ్బతో గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇద్దరు మృతి చెందారు. ఎండ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని, అత్య‌వ‌స‌రం అయితే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని, సాధ్య‌మ‌యిన‌న్నిఎక్కువ నీరు తాగాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు.  రాయలసీమ, కోస్తాలో ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎల్ నినొ ప్ర‌భావం కార‌ణంగా రుతుప‌వ‌నాలు ఆల‌స్యం కావ‌చ్చ‌ని తెలుస్తుంది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle