భర్తపై కేసులు... అఖిలప్రియకు చిక్కులు
09-10-201909-10-2019 08:21:38 IST
2019-10-09T02:51:38.751Z09-10-2019 2019-10-09T02:51:30.831Z - - 08-12-2019

భూమా నాగిరెడ్డి తనయ.. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు చిక్కులు వచ్చి పడ్డాయి. ఆమె భర్త భార్గవరామ్‌పై కేసులమీద కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆయనపై మరో ఫిర్యాదు అందింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఆళ్లగడ్డ ఎస్ఐ రమేశ్ కుమార్ తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న భార్గవరామ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. సోమవారం సాయంత్రం తన కారును స్వయంగా నడుపుకుంటూ వెళుతున్న భార్గవను పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. ఏపీ పోలీసులను గుర్తించిన భార్గవ కారు ఆపకుండా వేగంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దారి గుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఎస్ ఐ రమేష్ తెలిపారు. గచ్చిబౌలిలోని ఓక్ వుడ్ హోటల్ వద్ద భార్గవ కారు ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా, కారు ఆపినట్లే ఆపి తప్పించుకున్నారు. తమ విధులకు ఆటంకపరచడంతో పాటు కారుతో గుద్దే ప్రయత్నం చేశాడని భార్గవపై ఎస్ఐ రమేశ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు కేసు చేశారు. ఐపీసీ సెక్షన్ 353, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భార్గవరామ్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. భార్గవరామ్ వ్యాపార భాగస్వామి అయిన శివరామ రెడ్డికి కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురంలో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40శాతం వాటా ఉంది. అయితే వ్యాపార లావాదేవీల విషయంలో వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఫ్యాక్టరీ వద్దకు వెళ్లిన భార్గవ రామ్.. ఫ్యాక్టరీకి తాళం వేసి బెదిరించినట్టు శివరామ రెడ్డి భార్య మాధవీ లత పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివరామ రెడ్డిపై దాడికి పాల్పడడంతో హత్యాయత్నం కేసు నమోదైంది. తాజాగా మరో కేసు నమోదు కావడంతో భార్గవరామ్ చిక్కుల్లో పడ్డట్టేనని అంటున్నారు.

వెనక్కు తగ్గిన సీఎం జగన్.. కిటికీల జీవోలు రద్దు!
an hour ago

డేటా చోరీ కేసు ఏమైంది? జగన్ కు కన్నా లేఖ
4 hours ago

జనానికి షాక్.. సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలకు బ్రేక్
5 hours ago

అధికారంతోనే అత్యాచారాలకు అడ్డుకట్ట: ప్రియాంకా గాంధీ
a day ago

ఆపరేషన్ టీడీపీ.. సీఎం జగన్ వ్యూహమిదేనా?
a day ago

టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి బీద మస్తాన్ రావు
07-12-2019

ఐఏఎస్, ఐపీఎస్‌ల ఒత్తిడికి లొంగే సజ్జనార్ అలా చేశారా?
07-12-2019

రేపిస్టుల లిస్టులో ఎంపీ గోరంట్ల మాధవ్.. నేషనల్ మీడియా టార్గెట్
07-12-2019

ఆ ఆరు జీవోలు నిలిపివేత.. జగన్ సంచలన నిర్ణయం
07-12-2019

ఒక్క ఎన్కౌంటర్... అనేక వాదనలు..!
07-12-2019
ఇంకా