newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

భరోసాకు వాయిదాలే కాదు.. నిరీక్షణా తప్పదా?!

17-10-201917-10-2019 08:40:49 IST
2019-10-17T03:10:49.647Z16-10-2019 2019-10-16T12:58:57.428Z - - 14-11-2019

భరోసాకు వాయిదాలే కాదు.. నిరీక్షణా తప్పదా?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతిరైతుకు 13 వేల 500 రూపాయలు అందించనున్నామని వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకాన్ని నిన్న నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సభా వేదిక మీదనే ఓ భారీ చెక్కు కటౌట్ ను అందిస్తూ ఫోజులిచ్చి కాసేపు ఆయన చేపట్టిన పథకంపై ఆయనకున్న ప్రేమను, రాష్ట్రంలోని రైతుల పట్ల ఆయనకున్న వాత్సల్యాన్ని వెళ్లబోసుకున్నారు.

అక్కడ సీఎం సభతో పాటే అన్ని జిల్లాలు, మండలాలలో కూడా ఆపార్టీ నేతలు అధికారులతో కలిసి ప్రథకాన్ని ప్రారంభించారు. జిల్లా కార్యాలయాలలో కూడా ప్రతి రైతుకు 7 వేల 500 రూపాయలతో కూడిన చెక్కులను కూడా అందించారు. అయితే అవి బ్యాంకులో వేసుకునేందుకు ఉపయోగపడే చెక్కులు కాదు కేవలం ఫోటోల కోసమే. చెక్కులు సంగతి పక్కన పెట్టినా సీఎం చెప్పినట్లుగా నేరుగా తమ ఖాతాలలో జమవుతాయని పథకం ప్రారంభమైన రోజునుండి రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే రైతులకు ఎక్కడా జమకాలేదు.. కేవలం ప్రతి గ్రామానికి పథకం అమలులోకి వచ్చే జాబితాలను విడుదల చేశారు. అది కూడా రాష్ట్రవ్యాప్తంగా పాతిక లక్షల మంది రైతు కుటుంబాలు అందులో లేవని ఇప్పటికే తేల్చారు. ఆ విషయన్ని పక్కనపెడితే అర్హులైన జాబితాలో ఉన్నవారికి నగదు ఎప్పుడు బదిలీ అవుతుందని అధికారులను అడిగితే వారి వద్ద కూడా స్పష్టమైన సమాధానం లేదు. గట్టిగా అడిగితే అసలు ఎప్పుడు వస్తాయో తాము చెప్పలేమని తేల్చేశారు. అంటే వాయిదాలే కాదు నిరీక్షణ కూడా తప్పదని అర్ధమవుతుంది.

ఇంతకీ పథకం ప్రారంభమైనా నగదు జమ కాకపోవడానికి కారణాలను విశ్లేషిస్తే ముందుగా జగన్ చేతుల మీదుగా విడుదలైన చెక్కు దగ్గర నుండే రావాల్సిఉంది. నిజానికి ప్రభుత్వం రైతు భరోసాకు గాను రూ.5510 కోట్లను కేటాయించారు. కానీ మొన్న సీఎం ఇచ్చిన నమూనా చెక్కులో రూ3785 కోట్లు మాత్రమే చూపించారు. దాదాపుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయల వరకూ లోటు పడిపోయింది. ఆర్థిక శాఖ ఒక మొత్తం విడుదల చేసేసిన తర్వాత ఎందుకు తగ్గిపోయాయన్నది అధికారవర్గాలకు మాత్రమే తెలిసిన విషయం.

నిజానికి ఆర్ధిక శాఖ ఆ మొత్తాన్ని ప్రభుత్వం పథకాన్ని మూడు ముక్కలు చేయడానికి ముందే విడుదల చేసింది. కానీ అంత మొత్తం ప్రభుత్వం పోగేసే పరిస్థితి ఇప్పట్లో లేదని తేలిపోవడంతో హడావుడిగా పథకాన్ని ముక్కలు చేసి దాన్ని కవర్ చేసుకొనేందుకు కొన్ని ఎత్తులు వేసి సక్సెస్ అయ్యారు. అలా తొలి విడతగా తమ దగ్గర ఉన్న జాబితా ప్రకారం లెక్కిస్తే వచ్చిన మొత్తం ప్రకారం సీఎం నమూనా చెక్కు అందించారు. మరి ఇప్పుడు ఆ చెక్కు ప్రకారం నగదు కోసమే ప్రభుత్వం నానారకాలుగా నిధులను సేకరిస్తుంది.

మొత్తంగా చూస్తే ప్రభుత్వ ఖజానాకు ఎప్పుడు ఎంతవరకు నగదు వస్తే అంత మొత్తంలో నిధులను రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు. ఈనెలాఖరుకు ఈ జమలు మొదలయ్యే అవకాశం ఉండగా ఒకేసారి మొత్తం ఖాతాలలోకి వస్తుందనుకున్న మొత్తాన్ని మొన్న ముక్కలు చేస్తే ఈరోజు జమలు ఎప్పుడో చెప్పేదెవరో కూడా దొరకడం లేదంటున్నారు. వైఎస్ఆర్ భరోసా కోసం వాయిదాలే కాదు.. నిరీక్షణ కూడా తప్పదంటూ రైతులు ఉసూరుమంటున్నారు.

 

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle