newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

భద్రాద్రి తూర్పుగోదావరిలోకి.. కేసీఆర్-జగన్ చర్చలు

08-06-201908-06-2019 08:23:08 IST
Updated On 24-06-2019 14:50:23 ISTUpdated On 24-06-20192019-06-08T02:53:08.623Z08-06-2019 2019-06-08T02:50:17.800Z - 2019-06-24T09:20:23.311Z - 24-06-2019

భద్రాద్రి తూర్పుగోదావరిలోకి.. కేసీఆర్-జగన్ చర్చలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది శ్రీరామనవమికి భద్రాచల రాముడికి సీఎం జగన్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించవచ్చు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సాగిపోతున్న ఏపీ-తెలంగాణ సీఎంలు భద్రాద్రి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం గ్రామాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయనున్నారని సమాచారం. ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భద్రాద్రిని ఏపీలో కలిపే ప్రతిపాదనపై కేంద్ర సర్కార్ సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Image may contain: 2 people, people sitting and indoor

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో భేటీ అయినప్పుడు విభజన సమస్యల పరిష్కారంపై చర్చ సందర్భంగా భద్రాచలం విలీనాంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు  తెలుస్తోంది. ఇఫ్తార్ విందు సాక్షిగా ఇరువురు సీఎంలు పెండింగులో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి ముందడుగు వేశారు.

ఏపీ సచివాలయం భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ వెనువెంటనే ఉత్తర్వులు కూడా వచ్చాయి. అదే తరహాలో భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు తెలంగాణ సీఎం సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయేటప్పటికి భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. ఆ భౌగోళిక స్వరూపం మళ్ళీ ఉండేలా ఈ ఏర్పాటు జరగనుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం భద్రాచలంలో దగ్గరి కొన్ని మండలాలను ఏపీలో విలీనం చేశారు.

భద్రాచలం ఆలయం తప్ప చుట్టుపక్కల గ్రామాలన్నీ ఏపీలోనే ఉన్నాయి. ఇప్పుడు భద్రాద్రి రామాలయంను ఏపీలో కలిసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 

అయితే భద్రాద్రిని ఆంధ్రప్రదేశ్‌లో కలపాలంటే అంత ఆషామాషీ కాదు. రాష్ట్ర సరిహద్దులు మార్చాలంటే అసెంబ్లీ, పార్లమెంట్‌లో చట్ట సవరణ జరగాలి. ఆ తరువాత రాష్ట్రపతి గజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. అయితే ఇరు ప్రభుత్వాలు సుముఖంగా ఉంటే ఇది కష్టమేంకాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాగా ఒకప్పుడు ఏడు మండలాలను ఏపీలో కలపడంపై అప్పట్లో తెలంగాణ ఉద్యమ సంఘాలు, టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరి ఇప్పుడు భద్రాద్రి గ్రామాన్ని కూడా ఏపీలో కలిపితే ప్రజలు నుంచి ఆందోళనలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా సున్నితమైన ఈ అంశాన్ని పరిష్కరించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కసరత్తులు చేస్తాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle